నేరడిగొండ(ఇచ్చోడ): ఇందిరమ్మ ఇండ్లు పేదల ఆత్మగౌరవానికి ప్రతీక అని కాంగ్రెస్బోథ్ నియోజకవర్గ ఇన్చార్జి ఆడే గజేందర్ అన్నారు. ఇచ్చోడ మండలంలోని కోకస్ మన్నూర్ గ్రామంలో లబ్ధిదారులు నిర్మించుకున్న ఇందిరమ్మ ఇండ్లను శుక్రవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పేదలకు సొంతిల్లు ఉండాలన్నదే సర్కారు ప్రధాన లక్ష్యమని, అర్హులందరికీ ఇండ్లు ఇచ్చేందుకు కృషి చేస్తోందని పేర్కొన్నారు.
అనంతరం గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో ప్రహరీ గోడ నిర్మాణానికి భూమిపూజ చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ షామిమ్ భాను యూసుఫ్ , ఉప సర్పంచ్ విష్ణు, అంబేద్కర్ సంఘం అధ్యక్షుడు భీమ్రావు, యువజన కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షుడు బద్దం పోతారెడ్డి, నాయకులు పాల్గొన్నారు.
