మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యం : ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్

 మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యం : ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్

ఇంద్రవెల్లి, వెలుగు: కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వ ముందుకు సాగుతోందని ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్​ అన్నారు. శుక్రవారం ఇంద్రవెల్లి మండలంలోని ఈశ్వర్ నగర్, ముత్నూర్, ఉట్నూర్ మండలంలోని కన్నాపూర్, గంగాపూర్, పాత ఉట్నూర్ లో మహిళా సమాఖ్య భవనాలకు భూమిపూజ చేశారు. అనంతరం కన్నాపూర్, గంగాపూర్ గ్రామాల్లో కొత్తగా నిర్మించిన పంచాయతీ భవనాలను ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర అభివృద్ధే ఎజెండాగా కాంగ్రెస్​సర్కారు పని చేస్తోందని, ప్రజలకు ఇచ్చిన అన్ని హామీలను నెరవేరుస్తామని పేర్కొన్నారు. ఏపీడీ గోవింద్ రావు, ఉట్నూర్ తహసీల్దార్ ప్రవీణ్, ఇంద్రవెల్లి తహసీల్దార్ ప్రవీణ్, ఎంపీడీవోలు జీవన్ రెడ్డి, రామ్​ప్రసాద్, ఇంద్రవెల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ ముఖాడే ఉత్తమ్, సర్పంచ్​లు శారద, విఠల్, ఉప సర్పంచ్ రాహుల్ ఉన్నారు.