సంత్ సేవాలాల్ జీవితం ఆదర్శప్రాయం : మహేశ్వర్రెడ్డి

సంత్ సేవాలాల్ జీవితం ఆదర్శప్రాయం : మహేశ్వర్రెడ్డి

ఖానాపూర్,  వెలుగు: సంత్ సేవాలాల్ మహరాజ్ జీవితం ఆదర్శప్రాయమని బీజేఎల్పీ నేత మహేశ్వర్​రెడ్డి, ఎమ్మెల్యేలు బొజ్జు పటేల్, రామారావు పటేల్ అన్నారు. సేవాలాల్ జయంతిని శుక్రవారం ఖానాపూర్ పట్టణంలో అధికారికంగా నిర్వహించారు. సేవాలాల్ ఫొటోకు పూజలు చేశారు. అంతకుముందు లంబాడా సంప్రదాయం ప్రకారం భోగ్ భండార్ నిర్వహించారు. సంత్ సేవాలాల్ చూపించిన మార్గంలో  ప్రతి ఒక్కరూ నడవాలని సూచించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బంజారాల అభివృద్ధికి కృషి చేస్తున్నాయని పేర్కొన్నారు.

అనంతరం గిరిజనుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. మాజీ ఎమ్మెల్యే రేఖా నాయక్, ఐటీడీఏ పీవో యువరాజ్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు రితీశ్ రాథోడ్, మున్సిపల్ మాజీ చైర్​పర్సన్లు చిన్న సత్యం, అంకం రాజేందర్, కాంగ్రెస్ మండల, పట్టణ అధ్యక్షులు దొనికేని దయానంద్,  నిమ్మల రమేశ్, బంజారా సంఘం నాయకులు రాథోడ్ తుకారాం, భూక్యా గోవింద్ నాయక్, జాదవ్ వెంకట్రావు, భూక్య రమేశ్ తదితరులు పాల్గొన్నారు.