డిసెంబరు నాటికి 85 వేల ఇళ్లు అందిస్తాం

డిసెంబరు నాటికి 85 వేల ఇళ్లు అందిస్తాం

హైదరాబాద్ నగరంలో డిసెంబరు నాటికి 85 వేల ఇళ్లు లబ్ధిదారులకు అందజేస్తామన్నారు మంత్రి కేటీఆర్. దేశంలో ఏ నగరంలో లేనంత భారీ ఎత్తున డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు. డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణంపై హైదరాబాద్ కలెక్టర్, మున్సిపల్ శాఖ అధికారులతో కేటీఆర్ సమీక్ష నిర్వహించారు. సుమారు 9 వేల 700 కోట్ల రూపాయలతో పేదలకు డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణం చేస్తున్నామన్నారు. డిసెంబర్ వరకు వరుసగా 85వేల ఇళ్ళు పేదలకు అందజేస్తామని తెలిపారు. 24 నియోజకవర్గాలకు నాలుగు వేల చొప్పున సూమారు లక్ష ఇళ్ళ నిర్మాణం చేపట్టామన్నారు. డబుల్ బెడ్ రూం ప్రాంతాల్లో తాగునీరు, విద్యుత్, మౌళిక వసతుల కల్పన పనులు మరింత వేగవంతం చేయాలని అధికారులను అదేశించారు. లబ్ధిదారుల ఎంపికకు సంబంధించి హౌసింగ్ శాఖతో చర్చించి, తుది మార్గదర్శకాలు ఒకటి రెండు రోజుల్లో విడుదల చేస్తామన్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణానికి స్థలాలు ఇచ్చిన వారి లిస్టును వేంటనే సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు మంత్రి కేటీఆర్ .