దోమలు రావు..పాములు పారిపోతాయ్.!

దోమలు రావు..పాములు పారిపోతాయ్.!

రంగారెడ్డి జిల్లా, వెలుగు :హరితహారం కార్యక్రమంతో భాగంగా రంగారెడ్డి జిల్లాలో 1.71 కోట్ల మొక్కలు నాటాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు . అందులో భాగంగా జిల్లాలోని 429 నర్సరీల్లో 2.4 కోట్ల మొక్కల పెం పకాన్ని చేపట్టారు . కొత్త పంచాయతీ చట్టం ప్రకారం ప్రతి గ్రామ పంచాయతీకి ఒక నర్సరీని ఏర్పాటు చేశారు. ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ ద్వారా 369, అటవీ శాఖ ద్వారా 60 నర్సరీలను ఏర్పాటుచేసి మొక్కలను పెం చుతున్నారు . ఇప్పటి వరకు మొక్కలు నాటేందుకు వీలుగా 5 లక్షల గుంతలను తవ్వి అందుబాటులో ఉంచారు. ఇటీవల కురిసిన వర్షాలకు రైతులు పొలం గట్లపై 25 వేల మొక్కలను నాటారు.

ఈసారి నాటే మొక్కలు

ఈ ఏడాది హరితహారంలో అనేక ప్రయోజనాలు సమకూర్చే మొక్కలను నాటాలని నిర్ణయిం చారు. ప్రాంతాలకు అనుగుణంగా వాటికి అనువైన మొక్కలు నాటనున్నారు .వాటిల్లో లెమన్‌ గ్రాస్‌, సెంటెడ్‌, యూకోలిప్టస్‌, మమాగని, బిల్లుడు మొక్కలతో దోమలతో పాటు పాములను నివారిం చే అవకాశం ఉంది.అదేవిధంగా గైరిసిఇయా, సిసల్‌ పిసియా,వక్కాయ మొక్కల పెంపకంతో ఎలుకలు, అడవి పందుల నివారణకు దోహదం చేస్తాయని శాస్త్రీయంగా నిర్ధారణ చేశారు. ఈ మొక్కల పెంపకంపై రైతులు, గ్రామీణ ప్రాంతాల ప్రజలు ప్రత్యేక దృష్టి సాధించాల్సిన అవసరం ఉందని అధికారులు చెబుతున్నారు . టేకు, యూకలిప్టస్‌, సుబాబుల్‌, మునగ, ఆకెశాస్ప్రింగ్ ల్‌, సర్వి,వెదురు, శ్రీ చందనం, జామ, మామిడి, బత్తాయి,జిలుగ, మలబరి వేప మొక్కలు పెం పకంతో కొన్ని సంవత్సరాల తర్వాత భారీ ఆదాయం వస్తుంది.ఇలాం టి మొక్కలను పెంచేం దుకు వీలుగా ప్రజల్లో అవగాహన కల్పిం చాలని ఇటీవల కలెక్టర్ లోకేశ్ కుమార్ మండల అభివృద్ధి అధికారులకు సూచించారు.

మొక్కలు బతికేనా..?
ఇప్పటి వరకు నాలు గు విడతలుగా హరితహారం కార్యక్రమాన్ని నిర్వహించారు. నాటిని మొక్కల్లో కనీసం 50 శాతం మొక్కలు కూడా బతకలేదు. మొక్కలన్నీ జియో ట్ యాగింగ్‌ చేసినప్పటికి ప్రస్తుతం ఆ మొక్కల ఆనవాళ్లు కూడా లేవని సమాచారం. వర్షాలు కురియకపోవడం,మున్సిపాలిటీ, గ్రామ పంచాయతీలు, ప్రభుత్వ కార్యాలయాల్లో నిర్వహణ లోపం, రైతులకు సకాలంలో మొక్కలు సరఫరా చేయకపోవడం వంటి పలు కారణాలతో పెద్ద ఎత్తున మొక్కలు చనిపోయాయి. ప్రభుత్వ కార్యాలయాల్లో ఎక్కడి మొక్కలు అక్కడే ఎండిపోయాయి. స్వచ్చందగా నియమించిన హరితకమిటీలు నా మమాత్రంగానే మిగిలాయి. విద్యార్థులు నాటిన మొక్కలు అక్కడక్కడ బతికాయి. ఎక్సైజ్‌ అధికారులు నాటిన మొక్కలు చాలా వరకు  బతకలేదు.