పికప్ చేసుకునేందుకు ఎయిర్ పోర్టు వెళ్లే వారికి షాకిచ్చింది బెంగళూరు కెంపెగౌడ్ ఎయిర్ పోర్టు అథారిటీ.. ఎయిర్ పోర్టులోకి ఎంట్రీకి కొత్త ఫీజులను వసూలు చేస్తోంది.. అరైవల్ పికప్ లైన్లలో వెయిటింగ్ టైంలో భారీగా ఛార్జీలను వసూలు చేస్తోంది. మొదటి 8నుంచి 13 నిమిషాలకు రూ. 150, 13-నుంచి 18 నిమిషాలకు 300 రూపాయలు వసూలు చేస్తోంది. ఇక 18 నిమిషాలు దాటిందా అంతే .. నేరుగా పోలీస్ స్టేషన్ కు వెళ్లాల్సింది.. ఇదంతా ఎయిర్ పోర్టులో వాహనాల రాకపోకలను నియంత్రించేందుకు అంటున్నారు అధికారులు.
డిసెంబర్ 8 నుంచి కెంపెగౌడ విమానాశ్రయం టెర్మినల్స్ 1, 2 రెండింటిలోనూ అరైవల్ పికప్ జోన్ల దగ్గర అనుమతించిన ఫ్రీ వెయిటింగ్ టైం కు మించి వాహనాలు నిలబడితే నిమిషాల చొప్పున లెక్క వేసి కొత్త ఎంట్రీ ఫీజులను వసూలు చేయనుంది బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం అథారిటీ. ఇక ఈ రూల్స్ కేవలం అరైవల్ పికప్ జోన్లకు మాత్రమే వర్తిస్తాయి.. డిపార్చర్ ఎంట్రీలకు కాదు అని తెలిపింది.
►ALSO READ | రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. నాన్ ఏసీ స్లీపర్ కోచ్ లో కూడా బెడ్ షీట్లు, పిల్లోస్
ఇక ఎల్లో బోర్డు ట్యాక్సీలు, ఎలక్ట్రిక్ క్యాబ్ లు, సెల్ఫ్ డ్రైవ్ కమర్షియల్ వెహికల్స్ నిర్ధిష్ట పార్కింగ్ ప్రాంతాల్లో మాత్రమే వేచి ఉండాలని తెలిపింది. 10 నిమిషాలు ఉచిత పార్కింగ్ లభిస్తుంది. ఆ తర్వాత కమర్షియల్ వెహికల్స్ పార్కింగ్ ఛార్జీలు వర్తిస్తాయి.
