ఢిల్లీలో జరిగిన 'ఇండియా AI ఇంపాక్ట్ సమ్మిట్'లో చోరీకి గురైన స్టార్టప్ పరికరాలు తిరిగి లభించాయని బెంగళూరుకు చెందిన వ్యవస్థాపకుడు ధనంజయ్ యాదవ్ సంతోషం వ్యక్తం చేశారు.
బెంగళూరుకు చెందిన 'నియోసేపియన్' అనే స్టార్టప్ వ్యవస్థాపకుడు ధనంజయ్ యాదవ్, ఢిల్లీలో జరిగిన ఒక పెద్ద కాన్ఫరెన్స్‌లో తన వస్తువులు పోయాయని గతంలో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీనికి సంబంధించి ఇప్పుడు అవి దొరికాయని, ఢిల్లీ పోలీసులు చాలా వేగంగా స్పందించారని కృతజ్ఞతలు తెలిపారు.
ఎం జరిగిందంటే : AI సమ్మిట్ మొదటి రోజు ప్రధాని మోడీ పర్యటన ఉండటంతో, భద్రతా కారణాల దృష్ట్యా ఎగ్జిబిషన్ ఏరియా ఖాళీ చేయాలని సెక్యూరిటీ సిబ్బంది ఆదేశించింది. అప్పుడు అతను నా వస్తువులు తీసుకెళ్లాలా అని అడిగితే.. పర్వాలేదు.. ఇక్కడే పెట్టండి, మేము చూసుకుంటాం" అని అక్కడి భద్రతా సిబ్బంది చెప్పారు.
కానీ కొన్ని గంటల తర్వాత తిరిగి వచ్చి చూడగా, అతని స్టార్టప్ తయారు చేసిన 'పేటెంట్ పొందిన AI వేరబుల్స్ వస్తువులు కనిపించకుండా పోయాయి. హై-సెక్యూరిటీ జోన్‌లో ఇలా జరగడంపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. చివరికి పోలీసులు దర్యాప్తు చేసి పోగొట్టుకున్న వస్తువులను తిరిగి రికవరీ చేశారు.
అతని వస్తువులు దొరకడంపై కొందరు సంతోషం వ్యక్తం చేయగా, మరికొందరు మాత్రం సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్ అయితేనే పోలీసులు ఇంత వేగంగా స్పందిస్తారా? అని ప్రశ్నిస్తున్నారు. భారతదేశం ప్రపంచ స్థాయి సాంకేతిక కేంద్రంగా ఎదగాలంటే ఇలాంటి భద్రతా లోపాలు జరగకూడదని చాలా మంది అభిప్రాయపడ్డారు.
