బైక్ తాళాలు తీస్కున్నడని..ట్రాఫిక్ పోలీస్ చెయ్యి కొరికిండు

బైక్ తాళాలు తీస్కున్నడని..ట్రాఫిక్ పోలీస్ చెయ్యి కొరికిండు

బెంగళూరు: హెల్మెట్ లేకుండా స్కూటీ మీద వస్తున్న ఓ వ్యక్తిని ట్రాఫిక్ పోలీసులు ఆపారు. ఆపై బండి తాళాలు తీస్కున్నారు. దీంతో చిర్రెత్తిన ఆ బైకర్.. నా బండి తాళాలే గుంజుకుంటవా అంటూ కానిస్టేబుల్ చెయ్యి కొరికిండు. ఆపై బూతులు తిట్టుడు మొదలుపెట్టిండు. ఈ తతంగాన్నంతా పక్కనే ఉన్న మరో కానిస్టేబుల్ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వైరల్ అయింది. బెంగళూరులో మంగళవారం ఈ ఘటన జరిగింది. 

విల్సన్ గార్డెన్ వద్ద ట్రాఫిక్ పోలీసులు వెహికల్స్ చెక్ చేస్తున్నారు. సయ్యద్ సఫీ అనే యువకుడు హెల్మెట్ లేకుండా స్కూటీపై వస్తుండటంతో పోలీసులు అతడిని ఆపి బైక్ కీస్ తీస్కున్నారు. బైక్ కీస్ ఎందుకు తీస్కున్నావంటూ  సఫీ ఆ కానిస్టేబుల్ చెయ్యి కొరికాడు. ఆపై అక్కడినుంచి పారిపోయేందుకు ప్రయత్నించగా పోలీసులు సయ్యద్ సఫీని అరెస్ట్ చేశారు.