అమ్మేది పల్లీలే అయినా.. తెలివికి మాత్రం హ్యాట్సాప్..

అమ్మేది పల్లీలే అయినా.. తెలివికి మాత్రం హ్యాట్సాప్..

మార్కెటింగ్ టెక్నిక్స్ ఇవి ఉంటే చాలు.. కస్టమర్లకు ఆకర్షించటం పెద్ద కష్టం ఏమీ కాదు.. ఉన్న నాలుగు రూపాయల సరుకు.. 40 రూపాయలకు అమ్మొచ్చు.. ఇక ఫుడ్ విషయంలో అయితే మరింత లోతుగా ఆలోచించాల్సిన అవసరమే.. క్వాలిటీ, క్వాంటిటీ అనేది ఎంతో ముఖ్యం.. ఇవన్నీ ఉన్నా ఒక్కోసారి వ్యాపారంలో రాణించటం కష్టం.. డిజిటల్ మీడియా యుగంలో ఆలోచనలకు కొదవలేదు.. కస్టమర్ నాడి పట్టుకుంటే చాలు.. ఇలాంటి ప్రయోగమే చేసి.. రోడ్ సైడ్ పల్లీల వ్యాపారి ఇప్పుడు అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాడు.

అమ్మేది పల్లీలే అయినా.. లోతుగా ఆలోచించాడు. కస్టమర్లను ఎట్రాక్ట్ చేయటానికి చిన్న టెక్నిక్ ఉపయోగించాడు.. అదే హెల్త్.. ఇప్పుడు ఇదే వైరల్ అవుతుంది.. ఇంతకీ ఈ పల్లీల వ్యాపారి చేసిన ప్రయోగం ఎంటో చూద్దాం...నిత్యం బిజీగా ఉంటే సిలికాన్ వ్యాలీ..బెంగుళూరు పట్టణంలో ఓ వీధి వ్యాపారి పల్లీలు అమ్ముకునేందుకు తన తెలివి తేటలు, సృజనాత్మకతను ఉపయోగించి స్మార్ట్ బిజినెస్ చేస్తున్నాడు.. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 

ఈ ఊహించని పోస్టర్లతో ఆకర్షితులైన వినియోగదారులు సోషల్ మీడియాలో ఫొటోను షేర్ చేశారు. ఉత్పత్తి లక్షణాలు, ప్రయోజనాలు పర్ఫెక్ట్.. అని రాశారు. వేరు శెనగ విక్రేత అటువంటి చవకైన వస్తువు కోసం నాలెడ్జ్ ప్యాక్డ్ సేల్స్ పిచ్ ను ఏర్పాటు చేస్తాడని ఎవరం ఊహించలేదు అంటూ నెటిజన్లు కామెంట్స్ పెట్టారు. 

ఎప్పుడు బిజీగా ఉంటే బెంగుళూరులో చరిత్రలో ఇలాంటివి  కొత్తేమి కాదు. ఇటీవల కాలంలో ఓ జ్యూస్ విక్రేత కూడా 2వేల మంది సబ్ స్కైబర్లతో యూట్యూబ్ ఛానెల్ తో వైరల్ అయ్యాడు. వీరితోపాటు చాలామంది బెంగుళూరు స్థానికులు , వ్యాపారులు, దుకాణదారులు, ఆటో రిక్షా డ్రవైర్లు కూడా యూట్యూబ్ లో బ్యాండ్ వాగన్ లోకి ప్రవేశించిన విషయం మనందరికి తెలిసిందే. 

బెంగుళూరులో ఈ వేరుశనగ వ్యాపారి కేవలం చిరుతిళ్లు మాత్రమే అమ్మడం లేదు. వ్యాపార స్మార్ట్ , హద్దులేని సృజనాత్మకతతో వారి అనుభవాన్ని కూడా విక్రయిస్తున్నారు. హ్యాట్సాఫ్ టు పీనట్ వెండర్..