
వీకెండ్ వచ్చిందంటే చాలు వైన్ షాపులు, బార్లు హౌస్ ఫుల్ అవుతుంటాయి. వారమంతా కస్టపడి.. వీకెండ్ చిల్ అవుదామని వచ్చే బ్యాచ్ తో బార్లు కలకలలాడుతుంటాయి. బార్ కి వచ్చే కస్టమర్లను అట్రాక్ట్ చేయడం కోసం స్క్రీన్స్ ఏర్పాటు చేయడం, మ్యూజిక్, వన్ ప్లస్ వన్ ఆఫర్స్, హ్యాపీ అవర్స్, ఇలా రకరకాల ఆఫర్స్ పెడుతుంటారు బార్ ఓనర్స్. బెంగళూరు, హైదరాబాద్ లాంటి సిటీల్లో చెప్పాల్సిన పనిలేదు... కొన్ని బార్లలో మ్యూజిక్ షోస్ కూడా ఏర్పాటు చేస్తుంటారు. బెంగళూరులో బార్లు కొత్త ట్రెండ్ కి నాంది పలికాయి... లేడీ స్టాఫ్ ను నియమించి వాళ్లకు పొట్టి డ్రెస్సులు వేసి కస్టమర్లను అట్రాక్ట్ చేస్తున్నారు. ఒకరకంగా చెప్పాలంటే కనుమరుగైన డ్యాన్స్ బార్ కల్చర్ ను మళ్ళీ మొదలెట్టాయి బెంగళూరు బార్లు. ఇటీవల బెంగళూరులో బార్లపై పోలీసులు జరిపిన తనిఖీల్లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
బెంగళూరులోని కబ్బన్ పార్క్, ఉప్పర్ పేట్, అశోక్ నగర్, ఎస్జేపీ పార్క్ పోలీస్ స్టేషన్ తదితర ఏరియాల్లో బార్లలో తనిఖీలు నిర్వహించారు పోలీసులు. ఈ తనిఖీల్లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. పలు బార్లలో అమ్మాయిలు పొట్టి డ్రెస్సుల్లో అమ్మాయిలు మందు సర్వ్ చేస్తూ.. కస్టమర్లను రెచ్చగొడుతున్నట్లు గుర్తించారు పోలీసులు.
అంతే కాకుండా ఏ ఒక్క బార్ కూడా పరిశుభ్రత పాటించడం లేదని తెలిపారు. కిచెన్ లో ఏ మాత్రం శుభ్రత పాటించడం లేదని తెలిపారు పోలీసులు. నిబంధనలు ఉల్లంఘించిన 19 బార్లపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు పోలీసులు.
నిబంధనలు ఉల్లంఘించిన 19 బార్లకు నోటీసులు పంపినట్లు తెలిపారు పోలీసులు. చట్టాన్ని అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు పోలీసులు.