అల్లాడిపోతున్న బెంగళూరు వాసులు.. ఉష్ణోగ్రతల్లో 14 డిగ్రీల వ్యత్యాసం

అల్లాడిపోతున్న బెంగళూరు వాసులు.. ఉష్ణోగ్రతల్లో 14 డిగ్రీల వ్యత్యాసం

వెదర్.. వాతావరణం.. అత్యంత దారుణంగా మారింది. ఇలాంటి పరిస్థితిని ఇప్పుడు బెంగళూరు వాసులు ఎదుర్కొంటున్నారు. పగలు భగభగ మండే ఎండ.. రాత్రి చలితో అనారోగ్యం బారిన పడుతున్నారు. సహజంగా ఉదయం, రాత్రి ఉష్ణోగ్రతల మధ్య తేడా 10 డిగ్రీల వరకు ఉండొచ్చు.. ఇప్పుడు బెంగళూరు సిటీలో ఇది 14 డిగ్రీల తేడాకు చేరింది. వాతావరణ మార్పులకు తట్టుకోలేక జనం అనారోగ్యం బారిన పడుతున్నారు.

2024, మార్చి 8వ తేదీ ఉదయం 35 డిగ్రీల ఎండ ఉంటే.. రాత్రి 21 డిగ్రీలకు పడిపోయింది. మార్చి 9వ తేదీ శనివారం మధ్యాహ్నం 34 డిగ్రీలు ఉంటే.. రాత్రి ఉష్ణోగ్రత 20 డిగ్రీలకు పడిపోతుందని వాతావరణ శాఖ ప్రకటించింది. అంతే కాదు.. రాబోయే ఐదు రోజులు అంటే.. మార్చి 15వ తేదీ వరకు ఇలాంటి వాతావరణమే ఉంటుందని స్పష్టం చేశారు అధికారులు.

Also read : కాంగ్రెస్ 70ఏళ్లలో చేసిన పనులను.. 10ఏళ్లలోనే చేశాం: మోదీ

2024 జనవరి నెలలో కేవలం 2 మిల్లీమీటర్ల వర్షపాతం మాత్రమే నమోదైంది. అంటే పూర్తిగా డ్రై వెదర్ కంటిన్యూ అవుతుంది మూడు నెలలుగా. దీంతో గాల్లో తేమ శాతం తగ్గిపోయి.. పొడి వాతావరణ పెరుగుతుంది. దీనికితోడు ఎండ తీవ్రత వల్ల.. జనం చాలా ఇబ్బంది పడుతున్నారు. ఉదయం పూట అత్యంత వేడిగా ఉండటం.. రాత్రి చలిగా ఉండటంతో.. వాతావరణాన్ని తట్టుకోలేక పిల్లలు, పెద్దలు అనారోగ్యం బారిన పడుతున్నారు. జ్వరం, తలనొప్పులు, వాంతులు వంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు.

ఇలాంటి వాతావరణం గతంలో ఎప్పుడూ లేదంటున్నారు బెంగళూరు వాసులు. అత్యధిక ఉష్ణోగ్రత 30 డిగ్రీలుగా నమోదయ్యేదని.. ఇప్పుడు పగటి ఉష్ణోగ్రత సరాసరి 5 డిగ్రీలు పెరిగిందని చెబుతున్నారు వాతావరణ శాఖ అధికారులు. దీనికితోడు నీటి సమస్య, భూగర్భ జలాలు అడుగంటిపోవటం వంటి కారణాలతో బెంగళూరు వాసులు కష్టాలు పడుతున్నారు..