కాంగ్రెస్ 70ఏళ్లలో చేసిన పనులను.. 10ఏళ్లలోనే చేశాం: మోదీ

కాంగ్రెస్ 70ఏళ్లలో చేసిన పనులను.. 10ఏళ్లలోనే చేశాం: మోదీ

ఎన్నికల్లో విజయం కోసం కాదు.. ప్రజల అభివృద్ధి కోసమే పనిచేస్తానన్నారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. రెండు రోజుల ఈశాన్య రాష్ట్రాల పర్యటనలో భాగంగా శనివారం అరుణాచల్ ప్రదేశ్ కు చేరుకున్న ప్రధాని.. ఈటానగర్ లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ  సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ.. నార్త్ ఈస్ట్ లో మోడీ గ్యారంటీ ఫలితాలు కనిపిస్తున్నాయన్నారు. మోడీ గ్యారంటీ అంటే ఏంటో అరుణాచల్ వస్తే తెలుస్తుందన్నారు.

 స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి 2014 వరకు ఈశాన్య ప్రాంతంలో దాదాపు 10వేల కిలోమీటర్ల జాతీయ రహదారిని నిర్మించారని.. కాని, మేము10 ఏళ్లలోనే ఈశాన్య ప్రాంతంలో 6వేల కిలోమీటర్లకు పైగా జాతీయ రహదారిని నిర్మించామని చెప్పారు. కాంగ్రెస్ 70 ఏళ్ల పాలనలో చేయలేని పనులను తాను 10 ఏళ్లలో చేశామన్నారు. సరిహద్దు గ్రామాలను కాంగ్రెస్ నిర్లక్ష్యం చేసిందని మండిపడ్డారు. నార్త్ ఈస్ట్ లో రూ.55వేల కోట్ల విలువైన పనులను ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. త్వరలో జరగబోయే లోక్ సభ ఎన్నికల్లో ఎన్డీఏ 400 స్థానాల్లో గెలుస్తుందని.. మూడోసారి కూడా తమదే అధికారమని ప్రధాని అన్నారు.