కజిరంగ నేషనల్ పార్క్ లో ప్రధాని మోదీ ఏనుగు సవారీ

కజిరంగ నేషనల్ పార్క్ లో ప్రధాని మోదీ ఏనుగు సవారీ

త్వరలో జరగబోయే పార్లమెంట్ ఎన్నికలకు ముందు  ప్రధానమంత్రి నరంద్ర మోదీ.. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో పర్యటిస్తూ.. అనేక అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తూ బిజీగా ఉన్నారు. ఇంత బిజీ షెడ్యూల్ ల్లోనూ మోదీ.. తన స్టైల్లో సరదాగా కాసేపు ప్రకృతిని ఆస్వాదిస్తూ ఎంజాయ్ చేశారు.

2024, మార్చి 9వ తేదీ శనివారం అసోం పర్యటనలో భాగంగా కజిరంగ నేషనల్ పార్క్ ను సందర్శించారు  ప్రధాని మోదీ. ఈ సందర్భంగా నేషనల్ పార్క్ లో  మోదీ ఏనుగు సవారి చేశారు. జంతువులు, పక్షులు ఫోటోలు తీస్తూ పార్క్ లో కలియదిరిగారు.  అనంతరం జీపు ఎక్కి పార్క్ లోని పలు ప్రాంతాలను సందర్శించారు. ప్రకృతిని ఆస్వాదిస్తూ.. దాదాపు రెండు గంటల పాటు ఈ పార్క్ లో పర్యటించారు మోదీ. ఈ పార్క్ లో పనిచేసే అటవీశాఖ సిబ్బందితో మోడీ ముచ్చటించారు.

Also read : ఢిల్లీ అభివృద్ధికి కేంద్రమే అడ్డంకి: కేజ్రీవాల్

కాగా,  రెండు రోజుల పర్యటన కోసం ప్రధాని శుక్రవారం సాయంత్రం కజిరంగకు చేరుకున్నారు.ఈరోజు మధ్యాహ్నం జోర్హాట్ జిల్లాలో లెజెండరీ అహోమ్ జనరల్ లచిత్ బర్పుకాన్ 125 అడుగుల శౌర్య విగ్రహన్ని మోడీ ప్రారంభించనున్నారు. జిల్లాలో సుమారు రూ.18 వేల కోట్ల విలువైన పలు ప్రాజక్టులను మోదీ ప్రారంభిస్తారు.