మనకు రావేంటి ఇలాంటి ఐడియాలు .. ట్రాఫిక్‌లోనే కూరగాయలు తరిగేసుకుంది

మనకు రావేంటి ఇలాంటి ఐడియాలు ..   ట్రాఫిక్‌లోనే కూరగాయలు తరిగేసుకుంది

హైదరాబాద్లో ట్రాఫిక్  ఎలా ఉంటుందో మనందరికీ తెలుసు..   బెంగళూరులో  అయితే ఇంతకుమించి ఉంటుంది.  ఒక్కసారి ట్రాఫిక్‌ లో ఇరుక్కుంటే ఎప్పుడు ఇంటికి వెళ్తామో చెప్పలేము. ఆ ట్రాఫిక్ క్లియర్ అయ్యే లోపు మనం  చాలా పనులు చేసుకోవచ్చు.. సరిగ్గా ఇలాగే అనుకున్న ఓ మహిళా టైమ్ వృధా చేయడం ఎందుకని ట్రాఫిక్ క్లియర్ అయ్యే లోపు తన కారులోని ఎంచక్కా కూర్చని చక్కగా కూరగాయలను తరిగేసుకుంది.  దీనికి సంబంధించిన ఫొటోను ట్విటర్‌లో షేర్‌ చేయడంతో ఇప్పుడిది వైరల్ గా మారింది.  

బెంగళూరుకు చెందిన ప్రియా అనే మహిళా ట్రాఫిక్‌లో చిక్కుకుపోయి ఈ పనిచేసింది.  ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో నెటిజన్లు ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు.   గతంలో ఒక వ్యక్తి ట్రాఫిక్‌లో ఉన్న కూడా తన భోజనాన్ని పూర్తి చేసిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే..  ట్రాఫిక్‌ సమస్య వల్ల  బెంగళూరు నగరానికి ఏటా రూ.19,725 కోట్లు నష్టం వాటిల్లుతోందని ఒక సర్వేలో వెల్లడైంది.