లులూ మాల్ లో లుచ్చాగాడు : రద్దీ వేళల్లో అమ్మాయిలతో కావాలనే అసభ్యప్రవర్తన

లులూ మాల్ లో లుచ్చాగాడు : రద్దీ వేళల్లో అమ్మాయిలతో కావాలనే అసభ్యప్రవర్తన

బెంగళూరులోని ఓ మాల్‌లో ఓ యువతిని వృద్ధుడు లైంగికంగా వేధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో పోలీసులు దీనిపై విచారణ ప్రారంభించారు. రద్దీగా ఉండే మాల్‌లోని గేమ్స్ జోన్‌లో నిందితుడు ఉద్దేశపూర్వకంగానే మహిళ వెనుక భాగాన్ని తాకుతున్నట్టు ఈ వీడియో చూపిస్తోంది. ఈ ఉద్దేశపూర్వక దుష్ప్రవర్తన తర్వాత ఆ వ్యక్తి మరొక ప్రదేశానికి వెళ్లడాన్ని కూడా ఇందులో చూడవచ్చు. అయితే ఈ ఘటనలో బాధితురాలు ఎలాంటి ఫైట్ చేయలేదు. ఈ వీడియో ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో అప్‌లోడ్ చేయగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఈ ఘటన లులు మాల్‌లో జరిగినట్లు అప్‌లోడర్ తెలిపాడు. “ఈ రోజు సాయంత్రం 6.30 గంటల ప్రాంతంలో లులు మాల్ ఫంచురా బెంగళూరులో ఈ సంఘటన రికార్డ్ చేయబడింది. వీడియోలో ఉన్న ఈ వ్యక్తి ఇక్కడ చుట్టుపక్కల ఉన్న మహిళలు, బాలికలతో ఇలా ప్రవర్తిస్తున్నాడు అని క్యాప్షన్ లో పెద్ద నోట్ లో రాసుకొచ్చాడు.

“మొదట నేను అతన్ని చాలా రద్దీగా ఉన్న ప్రాంతంలో చూసినప్పుడు, అతనిపై నాకు అనుమానం కలిగింది. దీంతో వెంటనే వీడియో రికార్డ్ చేస్తూ అతన్నే అనుసరించాను. అప్పుడు నాకు ఇది కనిపించింది. దీనిపై సెక్యూరిటీకి వెళ్లి ఫిర్యాదు చేయడంతో అతడిని వెతుక్కుంటూ వచ్చాం. మాల్ మేనేజ్‌మెంట్, సెక్యూరిటీకి సమాచారం అందించారు. వారు ఆ వ్యక్తిని కనుగొని చర్యలు తీసుకుంటామని చెప్పారు. అలాంటి వ్యక్తులు నిజంగా ఇలాంటి పని చేసినందుకు సిగ్గుపడాలి" అని విజిల్‌బ్లోయర్ తెలిపాడు.