
దుబాయ్: రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. డివిలియర్స్ బౌలర్లను చెడుగుడు ఆడుకున్నాడు. 22 బంతుల్లోనే ఫోర్, 6 సిక్సర్లతో 55 పరుగులు చేసి ఒంటి చేత్తో మ్యాచ్‌ను గెలిపించాడు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ ఉతప్ప (22 బంతుల్లో 7 ఫోర్లు, సిక్సర్‌తో 41 పరుగులు), కెప్టెన్ స్మిత్ (36 బంతుల్లో 6 ఫోర్లు, సిక్సర్‌తో 57) రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసింది.
178 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి బరిలోకి దిగిన బెంగళూరు 23 పరుగుల వద్ద ఓపెనర్ అరోన్ ఫించ్ (14) వికెట్‌ను కోల్పోయింది. అయితే, ఆ తర్వాత మాత్రం జాగ్రత్తగా, జోరుగా ఆడింది. కోహ్లీ, పడిక్కల్ కలిసి బౌలర్లకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా పరుగులు రాబట్టుకున్నారు. ఈ క్రమంలో 102 పరుగుల వద్ద 35 పరుగులు చేసిన పడిక్కల్ అవుటయ్యాడు. ఆ తర్వాతి బంతికే కోహ్లీ (32 బంతుల్లో ఫోర్, 2 సిక్సర్లతో 43 పరుగులు) కూడా అవుటవడంతో బెంగళూరు శిబిరంలో కొంత ఆందోళన నెలకొంది.
అయితే, క్రీజులోకి వచ్చిన డివిలియర్స్ పూనకం వచ్చినట్టు ఊగిపోయాడు. రాజస్థాన్ బౌలర్లను చెడుగుడు ఆడుకున్నాడు. సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. దీంతో స్కోరు ఎక్స్‌ప్రెస్ వేగంతో పరుగులు పెట్టింది. బంతులకు చేయాల్సిన పరుగులకు మధ్య అంతరం తగ్గడంతో బెంగళూరు విజయం ఖాయమైంది. ఏబీడీ చెలరేగుతుంటే గురుకీరత్ సింగ్ అతడికి అండగా నిలిచాడు. స్ట్రైక్ రొటేట్ చేస్తూ ఎక్కువగా అవకాశం కల్పించాడు. డివిలియర్స్ 22 బంతుల్లో ఫోర్, 6 సిక్సర్లతో 55 పరుగులు చేసి జట్టును విజయ తీరాలకు చేర్చాడు.
We said we’ve done this before, didn’t we? ?
Never stop believing. ??#PlayBold #IPL2020 #WeAreChallengers #Dream11IPL #RRvRCB pic.twitter.com/mAjfeuW9J5
— Royal Challengers Bangalore (@RCBTweets) October 17, 2020