మానవత్వం చాటిన బెంజ్ కార్ ఓనర్ 

మానవత్వం చాటిన బెంజ్ కార్ ఓనర్ 

యాక్సిడెంట్లో తీవ్రంగా గాయపడ్డ యువకుడిని సకాలంలో హాస్పిటల్లో చేర్చి ఓ వ్యక్తి మానవత్వం చాటుకున్నాడు. గచ్చిబౌలి ఫ్లై ఓవర్పై నుంచి లింగంపల్లి వైపు వెళ్తున్న ఓ యువకుడి బైక్ అదుపుతప్పి డివైడర్ ను ఢీకొంది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ అతన్ని హాస్పిటల్కు తరలించేందుకు స్థానికులు అంబులెన్స్కు ఫోన్ చేశారు. ఎంతసేపటికీ అంబులెన్స్ రాకపోవడంతో ఆ సమయంలో అటుగా వెళ్తున్న ఓ వ్యక్తి తన బెంజ్ కారులో బాధితున్ని దగ్గరలో ఉన్న ఓ ప్రైవేటు హాస్పిటల్కు తరలించారు. తీవ్రగాయాలైన యువకునికి సకాలంలో వైద్యం అందడంతో ప్రాణాపాయం తప్పింది. సకాలంలో స్పందించిన బెంజ్ కారు యజమానిని పలువురు ప్రశంసిస్తున్నారు.