V6 News

మాల విద్యార్థులను విడుదల చెయ్యాలి : బేర బాలకిషన్

మాల విద్యార్థులను విడుదల చెయ్యాలి : బేర బాలకిషన్
  • బేర బాలకిషన్

ట్యాంక్ బండ్, వెలుగు: ఎస్సీ వర్గీకరణ చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అసెంబ్లీలో ప్రవేశపెట్టాలని మాల సంఘాల జేఏసీ గ్రేటర్ హైదరాబాద్ చైర్మన్ బేర బాలకిషన్ డిమాండ్ చేశారు. ఎస్సీలలోని 59 కులాలకు సీఎం రేవంత్ రెడ్డి సమానంగా న్యాయం చేయాలని కోరారు. బుధవారం ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద రాజ్యాంగం ప్రకారం సమాన న్యాయం కావాలని కోరుతూ ఆయన మాట్లాడారు. మాల విద్యార్థులకు రోస్టర్ విధానం వల్ల పూర్తిగా అన్యాయం జరుగుతుందన్నారు. 

కొత్తగా తెచ్చిన జీవో నంబర్ 99 వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఓయూలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన ఉంటే ముందస్తుగా అర్ధరాత్రి మాల విద్యార్థులను అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నమన్నారు. వారిని బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మాలలతో పెట్టుకుంటే ఈ ప్రభుత్వానికి తగిన బుద్ధి తప్పదని హెచ్చరించారు.