
50 ఓవర్ల వన్డే క్రికెట్ ను 20 ఓవర్లకు కుదించి నయా క్రికెట్ మజాను తీసుకొచ్చారు… ఇందులో భాగంగా.. భారత్ లో IPL ఆవిర్భవించింది. ఈ ఫార్మాట్ లో ఎక్కువగా బ్యాట్స్ మెన్ దే పై చేయిగా వస్తుంది. అయితే IPL 2019 సీజన్ లో మాత్రం బౌలర్లు సత్తా చాటారు. నిప్పులు చెరిగే బౌలింగ్ తో హార్డ్ హిట్టర్ లను సైతం కట్టడి చేశారు. 140 నుంచి 150 కిమీ ల వేగంతో బంతులు వేస్తూ బ్యాట్స్ మెన్ ను కంగారు పెట్టారు.. ప్రస్తుతం టాప్ 5 బౌలర్ల గురించి చూద్దాం.
రబాడా.. సౌత్ ఆఫ్రికాకు చెందిన ఈ బౌలర్… డిల్లీ క్యాపిటల్స్ తరపున ఆడాడు. IPL మొదలైనప్పటినుండి ఇప్పటివరకు చెత్త ప్రదర్శనతో ఉన్న ఢిల్లీకి ఇప్పుడు తురుపుముక్క అయ్యాడు.. నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్ లో హార్డ్ హిట్టర్ రస్సెల్స్ ను అద్భుతమైన యార్కర్ కు బౌల్డ్ చేశాడు. ఇప్పటికే 25 వికెట్లు తీసి అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్ గా పర్పుల్ క్యాన్ తో గుర్తింపు పొందాడు. వెన్ను నొప్పితో ఈ సీజన్ మధ్యలోనే ఇంటికి పయనమయ్యాడు.
నవదీప్ శైనీ.. బెంగళూరు కు ఆడిన ఈ యంగ్ బౌలర్… 13 మ్యాచుల్లో 11 వికెట్లు తీసాడు.. 150 కిమీల వేగంతో బంతులేయడం ఇతని ప్రత్యేకత.. ఈ ప్రదర్శన వల్ల 2019 ప్రపంచ కప్ కు స్టాండ్ బై స్థానానికి శైనీ పేరును కూడా పరిగణ లోకి తీసుకున్నారు సెలక్టర్లు.
జోఫ్రా ఆర్చర్.. ఇంగండ్ కు చెందిన ఈ యువ క్రికెటర్ రాజస్థాన్ తరపున ఆడాడు. ఇతను T20 స్పెషలిస్టుగా ఇప్పటికే గుర్తింపు తెచ్చుకున్నాడు. లైన్ అండ్ లెన్త్ లో మిస్ కాకుండా యార్కర్ లు వేయడంతో అందె వేసిన చేయి ఇతనిది. ఈ ప్రదర్శనతో ఇంగ్లాండ్ టీంలో వరల్డ్ కప్ కు స్థానం సంపాదించుకోవడం ఖాయమైంది.
జస్ర్పిత్ బుమ్రా. ఈ పేరు తెలియని భారత క్రికెట్ ప్రేమికుడు ఉండడు. ఇప్పటికే అంతర్జాతీయ స్థాయిలో తనకంటూ ఓ స్థానాన్ని పదిలపరుచుకున్నాడు బుమ్రా. ప్రస్తుతం ముంబై ఇండియన్స్ తరపున ఆడుతున్న బుమ్రా 17 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. ప్లేఆఫ్ లో జరిగిన తొలి మ్యాచ్ లో ధోనీ వంటి హార్డ్ హిట్టర్ ను నియంత్రించి మ్యాచ్ ను మలుపు తిప్పాడు.
ప్రసిద్ధ్ కృష్ణా.. కొల్ కతా నైట్ రైడర్స్ తరపున ఆడిన ఈ యువ బౌలర్ ఆ జట్టుకు కీలక ఆటగాడిగా తయారయ్యాడు. 140 కిమీల వేగంతో గతి తప్పని బంతులను వేయడంలో ప్రసిద్ధ్ దిట్ట. ఈ సీజన్ లో పెద్దగా వికెట్లను తీయకపోయినా బ్యాట్స్ మెన్ కట్టడిచేయడంలో సక్సెస్ అయ్యాడు.