DJ పెడితే తాట తీస్తాం : గణేష్ మండపాలపై వార్నింగ్ వచ్చేసింది..!

DJ పెడితే తాట తీస్తాం : గణేష్ మండపాలపై వార్నింగ్ వచ్చేసింది..!

వినాయక చవితి పండగకి ఇంకా కొద్దీ రోజులే ఉండటంతో ముంబైలో సందడి మొదలైంది. గత ఆదివారం అంటే ఆగస్టు 10న లాల్‌బాగ్, పరేల్, దాదర్ వంటి కీలక ప్రాంతాల నుండి వినాయకుడి విగ్రహాలను ఊరేగింపుగా తీసుకొచ్చారు. ఈ ఊరేగింపులలో డప్పుల శబ్దాలతో పెద్ద సంఖ్యలో ప్రజలు ఆనందంగా పాల్గొన్నారు. అయితే ఈ పండుగ కోసం ముంబై పోలీసులు కొన్ని కఠినమైన సూచనలు కూడా జారీ చేశారు. వినాయక చవితి సందర్భంగా డీజేలను  నిషేధించడమే కాకుండా నిబంధనలను ఉల్లంఘిస్తే కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 

 డీజే బ్యాన్ చేసిన కోర్టు: శబ్ద కాలుష్యాన్ని నివారించడానికి ముంబైలో డీజేల వాడకాన్ని బాంబే హైకోర్టు నిషేధించింది. అలాగే రాత్రి 10 గంటల నుండి ఉదయం 6 గంటల వరకు శబ్ద స్థాయిని 50 డెసిబల్స్ కి దాటొద్దని ఆదేశించింది. అయితే ఈ నిబంధన 
ఉల్లంఘించినవారి స్పీకర్లు, సౌండ్ బాక్సులు, డీజే సిస్టంలతో సహా అన్నిటిని స్వాధీనం చేసుకునే ప్రమాదం ఉంది. యాంప్లిఫైడ్ మ్యూజిక్ బదులు సాంప్రదాయ వాయిద్యాలను ఉపయోగించాలని కోర్టు కోరింది. 

ఆరోగ్య సమస్యలు: గతంలో డీజే సౌండ్స్ వల్ల ఆరోగ్య సమస్యలు రావడం, కొన్నిసార్లు కొందరు చనిపోవడం జరిగిందని అధికారులు చెబుతున్నారు.  ఈ నిషేధాన్ని ఉల్లంఘిస్తే నిర్వాహకులకు జరిమానాలు, సౌండ్ సిస్టం స్వాధీనం చేసుకోవడం మాత్రమే కాకుండా మండల్ లైసెన్స్‌ను రద్దు చేయవచ్చు అలాగే వినాయక మండపాలపై మరిన్ని ఆంక్షలు విధించవచ్చు. ఊరేగింపుల సమయంలో ఎలాంటి ఘటనలు జరగకుండా పర్యవేక్షిస్తామని పోలీసులు చెబుతున్నారు. అయితే ఈ ఆంక్షలు, నిబంధనలు హిందూ పండుగలను అన్యాయంగా లక్ష్యంగా చేస్తుందని కొందరు నిర్వాహకులు, కార్యకర్తలు వాదిస్తున్నారు.