హ‌త్య కేసులో జైలుకు.. క‌రోనా పేరు చెప్పి బెయిల్ అడిగితే..

హ‌త్య కేసులో జైలుకు.. క‌రోనా పేరు చెప్పి బెయిల్ అడిగితే..

ముంబై: కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న పరిస్థితుల్లో జైలులో ఉంటేనే సేఫ్​గా ఉంటావని ముంబై హైకోర్టు జడ్జి ​జీఎస్​పటేల్ గురువారం చెప్పారు. హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న జితేందర్​మిశ్రా వేసిన‌ టెంపరరీ బెయిల్​పిటిషన్ విచారణ సందర్భంగా జడ్జి ఈ కామెంట్స్​ చేశారు.

ప్రస్తుతం సిటీలో ఉన్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని బయట ఉండే కంటే జైలులో ఉంటేనే మంచిదని అన్నారు. బయట ఏం జరుగుతోందో మీకు తెలియదు, మునిసిపల్​అధికారులు కంటే జైలు అధికారులే మెరుగైన జాగ్రత్తలు తీసుకుంటున్నారని చెబుతూ పిటిషనర్​ టెంపరరీ బెయిల్​ పిటిషన్​ను నిరాకరించారు. ‘ఇప్పుడున్న పరిస్థితుల్లో వారెంట్ పై బయటకు పంపించడం సరికాదు. సిటీలో చాలా ప్రాంతాల్లో సీరియస్​ ఆంక్షలు ఉన్నాయి. తలోజా జైలు నుంచి ఒకరిని ఘట్​కోపర్​కు పంపించి వైరస్​సోకే ప్రమాదానికి అనుమతించలేను’ అని అన్నారు.