ఆసక్తిగా పరిశోధనలు చేసినప్పుడే మెరుగైన ఫలితాలు : డాక్టర్ డి.చెన్నప్ప

ఆసక్తిగా పరిశోధనలు చేసినప్పుడే మెరుగైన ఫలితాలు  :  డాక్టర్ డి.చెన్నప్ప

ముషీరాబాద్, వెలుగు :  స్టూడెంట్లు ఇంట్రస్ట్, కమిట్మెంట్​తో పరిశోధనలు చేసినప్పుడే మెరుగైన ఫలితాలు వస్తాయని ఓయూ కామర్స్ హెచ్ఓడీ ప్రొఫెసర్ డాక్టర్ డి.చెన్నప్ప చెప్పారు. సోమవారం బాగ్ లింగంపల్లి కాకా డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ కాలేజీలో కామర్స్ విభాగం ఆధ్వర్యంలో ‘ఆన్ హౌ టూ ప్రిపేర్ ఏ ప్రాజెక్ట్’ అనే అంశంపై వర్క్ షాప్ నిర్వహించారు. ప్రొ. చెన్నప్ప పాల్గొని సమాజంలో  ఉన్నటువంటి వివిధ సమస్యలకు అనుగుణంగా ఎలా రీసెర్చ్ చేయాలి, కామర్స్ స్టూడెంట్లు ఎంపిక చేసుకోవాల్సిన అంశాలను వివరించారు. అంతకుముందు బోటనీ విభాగం ఆధ్వర్యంలో విద్యార్థులకు న్యానో టెక్నాలజీ ఉపయోగాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఓయూ ప్రొఫెసర్ డాక్టర్ బీబీ హ్రస హాజరై మాట్లాడారు. ఈ కార్యక్రమాల్లో ఇనిస్టిట్యూషన్ డైరెక్టర్లు, ప్రిన్సిపల్స్, హెచ్ఓడీలు, సిబ్బంది పాల్గొన్నారు.