అమ్మతోడు నిజం : కార్పొరేట్ జాబ్ కంటే.. రెస్టారెంట్లలోనే జీతం ఎక్కువ.. బోర్డులు పెట్టి మరీ పిలుస్తున్నారు..

అమ్మతోడు నిజం : కార్పొరేట్ జాబ్ కంటే.. రెస్టారెంట్లలోనే జీతం ఎక్కువ.. బోర్డులు పెట్టి మరీ పిలుస్తున్నారు..

ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్న ఈ చిత్రం.. సింగపూర్‌లోని రెస్టారెంట్ వెలుపల రిక్రూట్‌మెంట్ పోస్టర్. ఇక్కడ ఉద్యోగులకు యాజమాన్యం ఇస్తున్న ప్రోత్సాహకాలు అందర్నీ ఎంతగానో ఆశ్చర్యపరుస్తున్నాయి. ఇది చూసిన చాలా మంది సాధారణ కార్పొరేట్ ఉద్యోగం కంటే ఇదే మంచిదని అంటున్నారు. 'X' యూజర్ 'గబ్బర్ సింగ్' అనే మైక్రో బ్లాగింగ్ ప్లాట్‌ఫారమ్‌లో షేర్ చేసిన ఈ ఫొటో.. .. “ఇక్కడ SGPలోని రెస్టారెంట్ వెలుపల రిక్రూట్‌మెంట్ పోస్టర్ ను చూడండి ”అని రాసుకువచ్చారు.

రెస్టారెంట్ లో సర్వీసెస్ అండ్ ఎంప్లాయి బెనిఫెట్స్ విషయానికొస్తే.. 'సర్వీస్ క్రూ', 'కిచెన్ క్రూ' కాగా.. ఉద్యోగి ప్రయోజనాల్లో స్టాఫ్ అలవెన్స్‌లు, వార్షిక ఇంక్రిమెంట్, లీవ్‌లు, మెడికల్ బెనిఫిట్స్, ఆరోగ్య ప్రయోజనాలు, ఆరోగ్య పరీక్ష సబ్సిడీలు, సంవత్సరానికి రెండుసార్లు బోనస్, వార్షిక ప్రాయోజిత దంత ప్రయోజనాలు, నెలవారీ ఆదాయ ప్రోత్సాహక బోనస్, అదనపు బీమా కవరేజ్, రెఫరల్ బోనస్, భోజన కేటాయింపులు, స్పాన్సర్‌షిప్‌లు ఉద్యోగుల అధ్యయన కోర్సు వంటివి ఉన్నాయి. దీంతో ఉద్యోగులకు కంపెనీ అందించే ప్రోత్సాహకాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఈ ఫొటో అప్‌లోడ్ చేయబడినప్పటి నుంచి 73వేల వ్యూస్ ను దక్కించుకుంది. చాలా మంది తమ అభిప్రాయాలను తెలుపుతూ కామెంట్లు సైతం పెడుతున్నారు. “ఇలాంటి కంపెనీలు లేదా ప్రయోజనాలు మాత్రమే ఉంటే, ఉద్యోగులు ఎప్పుడైనా ఉద్యోగాలు చేయడానికి తరలివస్తారు. గొప్ప అనుభూతి చెందుతారు. ఉద్యోగులు తమ పని పట్ల శ్రద్ధ వహించాలంటే కంపెనీలు తమ ఉద్యోగుల గురించి శ్రద్ధ వహించాలి”అని నెటిజన్లు అంటున్నారు.