హైదరాబాద్ బెట్టింగ్ ముఠాల దగ్గర కోట్లకు కోట్ల టర్నోవర్

హైదరాబాద్ బెట్టింగ్ ముఠాల దగ్గర కోట్లకు కోట్ల టర్నోవర్

భారత్ లో జరుగుతున్నఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) మ్యాచ్ లపై జోరుగాబెట్టింగ్ కొనసాగుతుంది. టాస్ దగ్గర నుంచి ఏ బంతికి ఏం జరుగుతుంది అనే దానిపై బెట్టింగ్ కడుతున్నారు. దీంతో బెట్టింగ్ రాయుళ్లను తరిమి కొట్టేందుకు పోలీసులు పక్కా ప్లాన్ తో దాడులు చేసి పట్టుకుంటున్నా.. బెట్టింగ్ రాయుళ్లలో మాత్రం భయం కనపడటం లేదు.

ఎక్కడంటే... 

హైదరాబాద్ నగరశివారులో IPL బెట్టింగ్ నిర్వహిస్తున్న స్థావరాలపై పోలీసుల దాడి చేశారు. పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ సమీపంలో IPL క్రికెట్ బెట్టింగ్ ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. ఈ దాడుల్లో 12 మందిని అరెస్టు చేయగా..ఐదుగురు పరారీలో ఉన్నారు. నిందితుల నుంచి 50 లక్షల రూపాయల నగదు, బ్యాంకు ఖాతాల్లో 3 లక్షల 29 వేలు.. స్మార్ట్ ఫోన్స్ 20, 8 ల్యాప్ టాప్ లు.. 43 కీ ప్యాడ్ ఫోన్స్, 4 టీవీలు ఎలక్ట్రానిక్ పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. మొత్తం కోటి 41 లక్షల 52 వేలు రూపాయలను స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ వెల్లడించారు.

మంగళవారం ( 18 Apr 2023 ) నాడు ఉప్పల్ లో జరిగిన మ్యాచ్ కోసం బెట్టింగ్ పెట్టేందుకు...పందెం రాయుళ్లు కాచుకొని ఉన్నారు. భారీ బెట్టింగ్ లు కాసేందుకు రెడీ అయ్యారు.దీంతో అప్రమత్తమైన పోలీసులు.. పందెం రాయుళ్లపై ప్రత్యేక నిఘా పెట్టారు. ఇప్పటికే నగరంలో పలు బెట్టింగ్ ముఠాలను అదుపులోకి తీసుకోగా.. రాజేంద్రనగర్ లోని మైలార్ దేవులపల్లి, మొయినాబాద్ పోలీస్ స్టేషన్ల పరిధిలో బెట్టింగ్ లకు పాల్పడుతన్న నలుగురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి భారీ మొత్తంలో నగదును స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ దాడిలో రూ. 46 లక్షలను సీజ్ చేశారు. కాగా పరారీలో మరికొందరు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.