దళితుల అభ్యున్నతే ధ్యేయంగా కేసీఆర్ కృషి

దళితుల అభ్యున్నతే ధ్యేయంగా కేసీఆర్ కృషి

హైదరాబాద్: దళితుల అభ్యున్నతే ధ్యేయంగా సీఎం కేసీఆర్ పని చేస్తున్నారని బేవరేజ్ కార్పొరేషన్ చైర్మన్ గజ్జెల నగేష్ అన్నారు. తెలంగాణ నూతన సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టాలని సీఎం కేసీఆర్ నిర్ణయించడంపై కంటోన్మెంట్ అన్నానగర్ లోని తెలంగాణ తల్లి విగ్రహం చౌరస్తా వద్ద అంబేద్కర్, కేసీఆర్ చిత్రపటాలకు నగేష్ పాలాభిషేకం చేశారు. సీఎం కేసీఆర్ కొత్త సచివాలయ భవనానికి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరు పెట్టాలని చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టి దళితుల ఆత్మగౌరవాన్ని కేసీఆర్ మరింత పెంచారన్నారు. 

దళితుల కోసం గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇన్ని పథకాలు కేటాయించలేదని, రాష్ట్రంలో దళితులంతా ఆత్మగౌరవంతో బతకాలని కేసీఆర్ దళితబంధును ప్రవేశపెట్టారని నగేష్ చెప్పారు. నూతనంగా నిర్మిస్తున్న పార్లమెంట్ భవనానికి అంబేద్కర్ పేరు పెట్టి..  ఆయన గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పాలని కేంద్ర ప్రభుత్వాన్ని గజ్జెల నగేష్ డిమాండ్ చేశారు.