ఏప్రిల్ 18న బీఆర్ఎస్ అభ్యర్థులకు బీఫామ్లు

ఏప్రిల్ 18న బీఆర్ఎస్ అభ్యర్థులకు బీఫామ్లు
  • ఒక్కొక్కరికీ రూ.95 లక్షల చెక్కులు
  • కేసీఆర్​అధ్యక్షతన మీటింగ్​ 

హైదరాబాద్: మాజీ సీఎం కేసీఆర్​అధ్యక్షతన ఈనెల 18న తెలంగాణ భవన్ లో  బీఆర్ఎస్​ కీలక సమావేశం జరగనుంది. ఎంపీ అభ్యర్థులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా పార్టీ అధ్యక్షులు, జడ్పీ చైర్మన్లు, కార్యవర్గ సభ్యులకు ఆహ్వానం అందింది. ఈసందర్భంగా పార్లమెంట్ ​క్యాండిడేట్లకు బీ -ఫామ్స్, ఎన్నికల ఖర్చు కోసం రూ. 95 లక్షల చొప్పున చెక్కులు ఇవ్వనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా  ఎన్నికల ప్రచారం, వ్యూహాలపై చర్చించనున్నారు.