
- విద్యార్థులకు ఐటీడీఏ పీవో రాహుల్ సూచన
జూలూరుపాడు, వెలుగు : విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో నైపుణ్యం సాధించాలని భద్రాచలం ఐటీడీఏ పీవో రాహుల్ సూచించారు. జూలూరుపాడు మండలం పడమటి నరసాపురం ఆశ్రమ పాఠశాలను మంగళవారం ఆయన సందర్శించారు. పిల్లలు ప్రదర్శించిన డాన్స్ చూసి అభినందించారు. అనంతరం రూ.40 వేలతో కొత్తగా ప్రారంభించిన టేబుల్ టెన్నిస్ ఇండోర్ గేమ్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా పీవో మాట్లాడుతూ ఐదు ఆశ్రమ పాఠశాలలో టేబుల్ టెన్నిస్, హ్యాండ్ బాల్ హాకీ రెజ్లింగ్ లాంటి ఆటలను ఇంట్రడ్యూస్ చేస్తున్నట్టు చెప్పారు.
పిల్లల్లో నైపుణ్యత పెంచేందుకు డిబేట్, వ్యాసరచన, ఎంబ్రాయిడరీ, పెయింటింగ్స్, కుట్లు. అల్లికలు తదితర కార్యక్రమాలను ఆశ్రమ పాఠశాలలో ప్రారంభిస్తున్నామని, తొలుత పడమటి నరసాపురం ఆశ్రమ పాఠశాల నుంచే స్టార్ట్చేస్తున్నట్లు చెప్పారు. పిల్లలు టీవీ కావాలని కోరగా, అందుకు స్పందించిన ఆయన వారం రోజుల్లో సమకూరుస్తానని హామీ ఇచ్చారు.