గిరిజనులపై ఆగని ఫారెస్ట్ అధికారుల దాడులు

గిరిజనులపై ఆగని ఫారెస్ట్ అధికారుల దాడులు

పోడు వ్యవసాయం చేసుకుంటున్న గిరిజనులపై ఫారెస్ట్ అధికారుల దాడులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రుగొండ మండలం ఎర్రబోడు గ్రామంలో  పోడు వ్యవసాయం చేస్తున్న మహిళా రైతులపై ఓ ఫారెస్ట్ అధికారి బెల్ట్ తో దాడి చేశాడు.  ఈ ఘటనలో పలువురు మహిళలకు గాయాలయ్యాయి. దీంతో వారిని చికిత్స నిమిత్తం కొత్తగూడెం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సదరు పోడు  రైతులు గత 20 ఏళ్లుగా  ఆ భూమిని సాగు చేసుకుంటున్నారు. ఫారెస్ట్ అధికారులు ఆ భూమిలో ట్రెంచ్ కొట్టి, భయాందోళనకు గురి చేశారని రైతులు ఆరోపిస్తున్నారు.