ఫారెస్టు రేంజ్ ఆఫీసర్ హత్య కేసులో ఇద్దరికి జీవిత ఖైదు

ఫారెస్టు రేంజ్ ఆఫీసర్ హత్య కేసులో ఇద్దరికి జీవిత ఖైదు

రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ చలమల శ్రీనివాసరావు హత్య కేసు నిందితులకు భద్రాద్రి జిల్లా కోర్టు జీవిత ఖైదు విధిస్తూ తీర్పు ఇచ్చింది.

2022 నవంబర్ 25 న చండ్రగొండ మండలం   బెండళపాడు గ్రామ పంచాయతీ ఎర్రబోడు అటవీ ప్రాంతంలో ఫారెస్ట్ ప్లాంటేషన్ పనులను సందర్శించడానికి వెళ్ళిన ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ చలమల శ్రీనివాసరావును ఎర్రబోడు గ్రామానికి చెందిన గొత్తి కోయలు చేతిలో దారుణ హత్యకు గురయ్యారు. హత్య చేసిన ఎర్రబోడు గొత్తి కోయల గ్రామానికి చెందిన మడకం తుల (43)పోడియం నంగా (37) గుర్తించారు. అతి దారుణంగా శ్రీనివాసరావును వేట కొడవళ్ళతో గొంతు కోసి హత్య చేశారు.

ALSO READ:దేశం షాక్ : 14 ఏళ్ల బాలికపై అత్యాచారం.. ఆ తర్వాత బొగ్గుల కొలిమిలో కాల్చేశారు..

ఇద్దరు నిందితులకు ఈ రోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాటిల్ వసంత్ జీవిత ఖైదు తో పాటు ఇద్దరికీ  చెరొక 1000 రూపాయల జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చారు.