ఇద్దరు మావోయిస్టులు..ఒక కొరియర్ అరెస్ట్

ఇద్దరు మావోయిస్టులు..ఒక కొరియర్ అరెస్ట్

ఇద్దరు మావోయిస్టులతో పాటు ఒక మహిళ కొరియర్ ను అరెస్ట్ చేశారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసులు. చర్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని దానవాయిపేట శివారులో వాహన తనిఖీలు చేస్తుండగా పోలీసులకు పట్టుబడ్డారు ఇద్దరు మావోయిస్టులు. వరంగల్ నుంచి వైద్య చికిత్సలు చేయించుకుని మళ్లీ..అడవిలోకి వెళ్తుండగా పోలీసులు అరెస్టు చేశారని తెలిపారు ఎస్పీ రోహిత్ రాజు.

 వీరితో పాటు ఒక మహిళా కొరియర్ గీతా గాయత్రిని కూడా అదుపులోకి తీసుకున్నామన్నారు. వారి దగ్గరి నుంచి మావోయిస్టు పార్టీకి చెందిన ముఖ్యమైన పత్రాలు, విప్లవ సాహిత్యాన్ని స్వాధీనం చేసుకున్నామన్నారు. ఇప్పటికైనా..మిగతా మావోయిస్టు సభ్యులు పోలీసుల ఎదుట లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలవాలని విజ్ఞప్తి చేశారు ఎస్పీ రోహిత్ రాజు.

Also Read :- రాష్ట్రంలో కొనసాగుతున్న ప్రజా పాలన