భగవాన్​ శ్రీ దేవనారాయణ అవతార ఉత్సవంలో ప్రధాని

భగవాన్​ శ్రీ దేవనారాయణ అవతార ఉత్సవంలో ప్రధాని
  • అలాంటి వారికి దూరంగా ఉండాలన్న ప్రధాని మోడీ
  • భగవాన్​ శ్రీ దేవనారాయణ అవతార ఉత్సవంలో ప్రధాని

న్యూఢిల్లీ: ఇండియాను విడగొట్టేందుకు చాలామంది ప్రయత్నించారని, అయినా ఎవరూ సక్సెస్ కాలేదని ప్రధాని మోడీ అన్నారు. దేశాన్ని విచ్ఛిన్నం చేసేందుకు ప్రయత్నిస్తున్న వారితో దూరంగా ఉండాలని సూచిం చారు. దేశంలోని అన్ని వర్గాల అభివృద్ధి కోసం తమ ప్రభుత్వం కృషి చేస్తున్నదన్నారు. అణగారిన వర్గాలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చేందుకు తమ సర్కార్ ప్రయత్నిస్తున్నదని తెలిపారు. గత ప్రభుత్వాలు వీరందరినీ నిర్లక్ష్యం చేశాయని విమర్శించారు. గుర్జార్ కమ్యూనిటీ ఆరాదించే భగవాన్ శ్రీ దేవ నారాయణ 1111వ అవతార దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం మోడీ రాజస్థాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని భిల్వారా జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా మలసేరి డుంగ్రి గ్రామంలో ఏర్పాటుచేసిన సంస్మరణ సభలో మోడీ పాల్గొని మాట్లాడారు. భగవాన్ దేవనారాయణ ఎప్పుడూ సామాజిక సేవ, ప్రజా సంక్షేమానికి ప్రాధాన్యత ఇచ్చారని, తన జీవితాన్ని ప్రజల కోసమే ధారపోశారని కొనియాడారు. లార్డ్ దేవనారాయణ కమలంపై ఉంటారని, దేవనారాయణ శిష్యుడిగా ఈ ప్రోగ్రాంకు వచ్చానని తెలిపారు.

ప్రపంచమంతా మనల్నే చూస్తున్నది

‘‘ప్రపంచమంతా ఇప్పుడు ఎంతో ఆశగా ఇండియా వైపు చూస్తున్నది. వరల్డ్​ వైడ్​గా మన స్ట్రెంత్, పవర్​ను చూపించాం. ఇతర దేశాలపై ఆధారపడటాన్ని చాలా వరకు తగ్గించుకున్నాం. గత ప్రభుత్వాలు చేసిన తప్పులను నయా ఇండియా సరిదిద్దుతున్నది”అని మోడీ అన్నారు. ‘ఎన్​డీఏ అధికారంలోకొచ్చినప్పటి నుంచి అన్ని వర్గాలకు సాధికారత కల్పించేందుకు కృషి చేస్తున్నాం. వేల ఏండ్ల ఇండియా ప్రయాణంలో సోషల్ పవర్ కీలక పాత్ర పోషించింది. మనమందరం మన వారసత్వాన్ని చూసి గర్విద్దాం. బానిస మనస్తత్వం నుంచి బయటపడాలి”అని మోడీ పిలుపునిచ్చారు.

రేషన్​ కష్టాలు పోయినయ్.. 

దేశంలో ఉన్న పేదోళ్లు రేషన్ కోసం గతంలో చాలా ఇబ్బందిపడేవాళ్లని, కానీ ఇప్పుడు ఫ్రీగా ఇస్తున్నామని మోడీ అన్నారు. ఆయుష్మాన్​ భారత్​తో మెడికల్ ట్రీట్​మెంట్ గోస పోయిందని గుర్తు చేశారు. కొంత మందికే బ్యాంకింగ్​ సేవలు అందేవని, కానీ ఇప్పుడు ప్రతీ గడపకూ సర్వీస్​ను విస్తరింజేశామని తెలిపారు. ఈ ప్రోగ్రాంలో బీజేపీ రాజస్థాన్​ స్టేట్​ ప్రెసిడెంట్ సతీశ్ పూనియా, కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్​తో పాటు పలువురు పార్టీ నేతలు, లీడర్లు పాల్గొన్నారు.