భగవంత్ కేసరి గణేష్ ఆంథెమ్ పోస్టర్ రిలీజ్.. బాలకృష్ణతో పాటు శ్రీలీల డాన్స్

 భగవంత్ కేసరి గణేష్ ఆంథెమ్ పోస్టర్ రిలీజ్.. బాలకృష్ణతో పాటు శ్రీలీల డాన్స్

నటసింహ నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna), టాలెంటెడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి(Anil Ravipudi) కాంబోలో వస్తున్న మాస్ ఎంటర్టైనర్ భగవంత్ కేసరి(Bhagavanth Kesari). లేటెస్ట్గా ఈ మూవీ నుంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ ప్రోమో రేపు (ఆగస్టు 30) సాయంత్రం 4.05PM కి రిలీజ్ చేస్తున్నట్టు పోస్టర్ రిలీజ్ చేశారు.సెప్టెంబర్ 1న పూర్తి పాట రిలీజ్ చేయనున్నారు మేకర్స్.

ఈ సాంగ్ గణేష్ చతుర్థి స్పెషల్ గణేష్ ఆంథెమ్గా రాబోతుంది. పోస్టర్లో బాలకృష్ణ తో పాటు శ్రీలీల కాషాయం డ్రెస్ లో.. డాన్స్ స్టెప్లో కనిపించడంతో ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. ఈ సాంగ్ను కాసర్ల శ్యామ్ రచించగా..శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ అందించారు.ఈ హుషారైన గీతంతో భగవంత్ కేసరి పాటల నగరా స్టార్ట్ కానుందని తెలుస్తోంది. 

త్వరలో భగవంత్ కేసరి ప్రీ రిలీజ్ ఈవెంట్ భారీగా కండక్ట్ చేయడానికి అనిల్ రావిపూడి రెడీ అయ్యినట్టు టాక్. ఇక ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజైన టీజర్కు ఆడియన్స్ నుండి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. 
దీంతో ఈ సినిమాపై అంచనాలు నెక్స్ట్ లెవల్కు చేరుకున్నాయి. 

ఇక భగవంత్ కేసరి సినిమా విషయానికి వస్తే..షైన్ స్క్రీన్(Shine screen) పతాకంపై సాహు గరికపాటి(Sahu garikapati) నిర్మిస్తున్న ఈ సినిమాలో.. కాజల్ అగర్వాల్(Kajal Agarwal) హీరోయిన్ గా నటిస్తుండగా..లేటెస్ట్ బ్యూటీ శ్రీలీల(Sreeleela) బాలకృష్ణకు కూతురిగా కనిపించనుంది. తమన్(Thaman) సంగీతం అందిస్తున్న ఈ సినిమా..2023 అక్టోబర్ 19న ప్రేక్షకుల ముందుకు రానుంది.