WHO పర్మిషన్ కోసం భారత్ బయోటెక్ ప్రయత్నాలు

WHO పర్మిషన్ కోసం భారత్ బయోటెక్ ప్రయత్నాలు

హైదరాబాదుకు చెందిన భారత్ బయోటెక్ సంస్థ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్ ను ప్రస్తుతం దేశంలో వినిగియోస్తున్నారు. కొవాగ్జిన్ ను ఇతర దేశాల్లో అందించేందుకు భారత్ బయోటెక్ ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో కొవాగ్జిన్ కు ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) అత్యవసర అనుమతుల కోసం భారత్ బయోటెక్ అవసరమైన సర్టిఫికెట్లను సమర్పించింది.

WHO కు ఇప్పటికే 90 శాతం సర్టిఫికెట్లు అందజేశామని, జూన్ కల్లా మిగిలిన పేపర్లు కూడా సమర్పిస్తామని తెలిపింది భారత్ బయోటెక్. ఇతర దేశాల్లోనూ కొవాగ్జిన్ వినియోగానికి WHO నుంచి పర్మిషన్ వస్తుందని భావిస్తున్నామని తెలిపింది. మరోవైపు.. అమెరికాలో మూడో దశ క్లినికల్ ట్రయల్స్ కు  సంప్రదింపులు ప్రారంభించినట్టు భారత్ బయోటెక్ చెప్పింది. FDAతో సంప్రదింపులు తుదిదశలో ఉన్నాయని వివరించింది. ఇప్పటికే 11 దేశాల్లో కొవాగ్జిన్ కు అనుమతులు లభించాయని తెలిపింది.