వ‌చ్చే ఏడాది ఫిబ్ర‌వ‌రికి క‌రోనా వ్యాక్సిన్

వ‌చ్చే ఏడాది ఫిబ్ర‌వ‌రికి క‌రోనా వ్యాక్సిన్

కరోనా వైరస్‌ నిర్మూలనకు భారత్‌ బయోటెక్‌ రూపొందిస్తున్న కోవాగ్జిన్‌ వ్యాక్సిన్‌ ఫిబ్రవరిలోనే రానుంద‌ని.. ఐసీఎంఆర్‌ ‌ సీనియర్‌ శాస్త్రవేత్త రజనీకాంత్ అన్నారు. కొవాగ్జిన్‌ టీకా వచ్చే ఏడాది మార్చి తర్వాత అందుబాటులోకి వస్తుందని తొలుత ఐసీఎంఆర్‌ అంచనా వేసినప్పటికీ, మొదటి రెండు దశల ఫలితాలు ఆశాజనంగా ఉండడంతో.. వ్యాక్సిన్‌ ఫిబ్రవరిలోనే విడుదలయ్యే అవకాశం ఉందని ఆయ‌న‌ అన్నారు. మూడో దశ ప్రయోగాలు ఈ నెలలో ప్రారంభం కానున్నాయని తెలిపారు.

ఫేజ్-1, ఫేజ్-2 ప్రయోగాల్లోనూ, జంతువులపై జరిపిన ప్రయోగాల్లోనూ వ్యాక్సిన్‌ సమర్థంగా పనిచేసిందని చెప్పారు. అయితే, మూడోదశ ఫలితాలు పూర్తికాకుండా నూరు శాతం కచ్చితంగా పనిచేస్తుందని అప్పుడే చెప్పలేమన్నారు. అత్యవసర వినియోగంపై ప్రభుత్వం కూడా ఆలోచన చేస్తోందని ర‌జ‌నీకాంత్ తెలిపారు.