భారత్ లో 375 మందిపై కోవ్యాక్సిన్ ట్రయల్స్

భారత్ లో 375 మందిపై కోవ్యాక్సిన్ ట్రయల్స్

హైదరాబాద్​: భారత్​ బయోటెక్​ తయారు చేసిన కరోనా వ్యాక్సిన్​ ‘కోవ్యాక్సిన్​’ ట్రయల్స్​ మొదటి మెట్టు ఎక్కాయి. దేశవ్యాప్తంగా ఫేజ్​1 ట్రయల్స్​ మొదలయ్యాయి. 375 మందిపై వ్యాక్సిన్​ను ప్రయోగిస్తున్నట్టు శుక్రవారం భారత్​ బయోటెక్​ ప్రకటించింది. ‘‘తొలి దేశీయ కరోనా వ్యాక్సిన్​ కోవ్యాక్సిన్​ ట్రయల్స్​ను జులై 15న ప్రారంభించాం. డబుల్​బ్లైండ్​ ప్లాసిబో కంట్రోల్డ్​ ట్రయల్స్​ను 375 మందిపై చేస్తున్నాం’’ అని కంపెనీ ట్వీట్​ చేసింది. డబుల్​బ్లైండ్​ ప్లసీబో పద్ధతి అంటే.. ఎవరికి ప్లసీబో ఇస్తున్నారో, ఎవరికి వ్యాక్సిన్​ ఇస్తున్నారో అటు పేషెంట్​కుగానీ, ఇటు రీసెర్చర్లకుగానీ తెలియదని కంపెనీ ప్రతినిధి ఒకరు చెప్పారు. ఓ వ్యక్తి శరీరంపై ఎలాంటి ఎఫెక్ట్​ చూపించని డమ్మీ మందునే ప్లసీబో అంటారు. షుగర్​ పిల్స్​, సెలైన్​ వంటి ఇనర్ట్​ మెడికేషన్​ను ప్లసీబోగా ఇస్తుంటారు. జబ్బుపై పేషెంట్లు ఎలా స్పందిస్తున్నారో, అది ఆ జబ్బుపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందో తెలుసుకునేందుకు ప్లసీబోలను ఇస్తారు. ఇప్పటికే ప్రిక్లినికల్​ ట్రయల్స్​ కోవ్యాక్సిన్​ మంచి ఫలితాలనిచ్చింది. పంద్రాగస్టునాటికి వ్యాక్సిన్​ వస్తుందని ఐసీఎంఆర్​ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఫేజ్​1 ట్రయల్స్​ను కంపెనీ స్టార్ట్​ చేసింది.