పశ్చిమబెంగాల్ లో రాహుల్ గాంధీ కారుపై దాడి..

పశ్చిమబెంగాల్ లో  రాహుల్ గాంధీ కారుపై దాడి..

పశ్చిమబెంగాలో లోని మాల్దాలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కారుపై  దుండగులు  రాళ్లతో  దాడి చేశారు. ఆయన కారు అద్దాలు ధ్వంసం అయ్యాయి. దీంతో అక్కడ ఉద్రిక్త నెలకొంది.  అక్కడున్న కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఒక్కసారిగా భయాదోళనకు గురయ్యారు. దాడి నుంచి రాహుల్ గాంధీ సురక్షితంగా బయటపట్డారు. దాడి తర్వాత రాహుల్ కారు దిగి బస్సులో కూర్చున్నారు. 

మాల్దా జిల్లాలోని హరిశ్చంద్రపుర్ లో రాహుల్ ప్రయాణిస్తున్న కారుపై దాడి జరిగిందని బెంగాల్ కాంగ్రెస్ చీప్ అధీర్ రంజన్ చౌదరి తెలిపారు.  ఇలాంటి దాడులు కరెక్ట్ కాదన్నారు.

 రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్ర చేపట్టినప్పటి నుంచి నిత్యం ఆటంకాలు సృష్టిస్తున్నారు దుండగులు. ఇటీవల మణిపూర్ లో రాహుల్ యాత్రను అడ్డుకున్న సంగతి తెలిసిందే.. లేటెస్ట్ గా పశ్చిమ బెంగాల్లో  రాహుల్ ను అడ్డుకోవడం కూడా రాజకీయ కుట్రలో భాగమేనని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు.