కలెక్టరేట్​ ఎదుట భారత్ మాల రైతుల నిరసన

కలెక్టరేట్​ ఎదుట భారత్ మాల రైతుల నిరసన

గద్వాల, వెలుగు: భారత్ మాల రోడ్డులో భూములు కోల్పోయిన రైతుల భూమికి రిజిస్ట్రేషన్ కావడం లేదని సోమవారం కలెక్టరేట్ ఆఫీస్ వద్ద నిరసన వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ.. భారత్ మాల రోడ్డు పనుల్లో కాలూర్ తిమ్మన్ దొడ్డి నుంచి తూర్పు గార్లపాడు వరకు భూములు కోల్పోయామన్నారు.

ఆ రైతులకు ఆదుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం ప్రజావాణిలో అధికారులకు వినతి పత్రం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వెంకటేశ్​, అనిమిరెడ్డి, తాయప్ప, శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.