యువత, రైతులకు అన్యాయం జరుగుతుంది: రాహుల్ గాంధీ

యువత, రైతులకు అన్యాయం జరుగుతుంది: రాహుల్ గాంధీ

అసోంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ  భారత్ న్యాయ్ యాత్ర విజయవంతంగా కొనసాగుతోంది. జనవరి 21వ తేదీ ఆదివారం పలు ప్రాంతాల్లో రాహుల్ యాత్రను కొనసాగించారు.  ప్రజలతో మమేకం అవుతూ ముందుకెళ్తున్నారు రాహుల్. ప్రజలతో కలిసి నడుస్తూ స్వయంగా వారి సమస్యలను వింటున్నారు. ఈ సందర్భంగా ఓ గ్రామంలో కార్నర్ మీటింగ్ లో రాహుల్ గాంధీ మాట్లాడారు.

బడావ్యాపారుల కోసం పనిచేస్తున్న ప్రధాని మోదీ సర్కార్ కు వ్యతిరేకంగానే భారత్ న్యాయ్ యాత్ర చేపడుతున్నామన్నారు రాహుల్ గాంధీ. అసోంలో యువత, రైతులకు అన్యాయం జరుగుతుందని ఆరోపించారు. ఇక్కడ నాణ్యమైన విద్యను పొందాలంటే లక్షలు ఖర్చు చేయాల్సిందేనన్నారు. డీమానిటైజేషన్ వల్ల అనేక మంది ఉపాధికోల్పోయారన్నారు. ప్రజల సమస్యలపై పోరాడటమే తమ లక్ష్యమని చెప్పారు. తమ భావజాలానికి మద్దతిస్తున్న ప్రతి ఒక్కరికి రాహుల్ గాంధీ ధన్యవాదాలు తెలిపారు.

ఈ నెల 14వ తేదీన రాహుల్ గాంధీ రెండో విడత యాత్రలో భాగంగా మణిపూర్ లో భారత్ జోడో న్యాయ్ యాత్రను ప్రారంభించిన సంగతి తెలిసిందే. మణిపూర్ నుండి ముంబయి వరకు రాహుల్ గాంధీ యాత్ర కొనసాగనుంది.