పింగళి వెంకయ్యకు భారతరత్న ఇవ్వాలి

పింగళి వెంకయ్యకు భారతరత్న ఇవ్వాలి
  •      పీసీసీ వర్కింగ్ ​ప్రెసిడెంట్​అంజన్ కుమార్ యాదవ్

ముషీరాబాద్, వెలుగు :  జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్యకు వెంటనే భారతరత్న ప్రకటించాలని  పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్ కుమార్ యాదవ్ డిమాండ్ చేశారు. పింగళి వెంకయ్య చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షురాలు కె.హెచ్.ఎస్ జగదాంబ ఆధ్వర్యంలో సోమవారం రాంనగర్ గుండులోని ట్రస్ట్ ఆఫీసులో జాతీయ పతాక 103 ఆవిర్భావ దినోత్సవం నిర్వహించారు.

అంజన్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పింగళి వెంకయ్య చరిత్రను భావితరాలకు తెలిసేలా పాఠ్యాంశంగా చేర్చాలన్నారు. పింగళి చారిటబుల్ ట్రస్ట్ సేవలు అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులను సత్కరించారు. ట్రస్ట్  చైర్మన్ కె. శ్యామలరావు, సభ్యులు శ్రీకాంత్, అనుదీప్, వెంకటేశ్వర్లు, అన్నపూర్ణ, కాంగ్రెస్ నాయకులు బాబురావు, సుబ్రహ్మణ్యం, వరదరాజు, కర్ణం సురేశ్, ఆనంద్, విజయ యాదవ్, జి.నాగేంద్ర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.