కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) సీనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
పోస్టు పేరు: సీనియర్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ (టెలికాం, ఫైనాన్స్) .
మొత్తం ఖాళీలు: 120.
ఎలిజిబిలిటీ
టెలికాం స్ట్రీమ్: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి కనీసం 60 శాతం మార్కులతో ఎలక్ట్రానిక్స్/ టెలికాం/ కంప్యూటర్ సైన్స్/ ఎలక్ట్రికల్/ ఇనుస్ట్రుమెంటేషన్ విభాగంలో బీఈ/ బి.టెక్ పూర్తిచేసి ఉండాలి.
ఫైనాన్స్ స్ట్రీమ్: చార్టెర్డ్ అకౌంటెంట్ (సీఏ) లేదా కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెంట్ (సీఎంఏ)లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి .
వయోపరిమితి: 21 నుంచి 30 ఏండ్ల మధ్యలో ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేండ్లు, ఓబీసీలకు మూడేండ్లు, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు పదేండ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
అప్లికేషన్: ఆన్లైన్ ద్వారా.
అప్లికేషన్ ప్రారంభం: ఫిబ్రవరి 05.
అప్లికేషన్ ఫీజు: అన్ రిజర్వ్డ్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.2,500. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు రూ.1250.
లాస్ట్ డేట్: మార్చి 31.
సెలెక్షన్ ప్రాసెస్: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ), డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
మరిన్ని వివరాలకు వెబ్ సైట్ bsnl.co.inను సందర్శించండి.
