దేశ ప్రజలకు రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలి: భారత్ సురక్ష సమితి

దేశ ప్రజలకు రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలి: భారత్ సురక్ష సమితి

జగిత్యాల పట్టణంలోని తహసీల్ చౌరస్తాలో భారత సురక్ష సమితి ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దహనం చేశారు. దేశ ప్రజలకు రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. బాధ్యతాయుతంగా ఉండాల్సిన ఎంపీ రాహుల్ గాంధీ కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ పట్ల అనుచితంగా వ్యవహరించడం మహిళా సమాజాన్ని కించపరిచేలా ఉందని రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఏసీఎస్ రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ మహిళలకు ఇచ్చే గౌరవం ఇదేనా అంటూ ప్రశ్నిచారు. వెంటనే భారత దేశ ప్రజలకు రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లోక్ సభలో రాహుల్ గాంధీ మాట్లాడిన భాష తీరును చూస్తే.. ఆయన భారతీయుడేనా అనే అనుమానం కలుగుతుందని రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎసిఎస్ రాజు విమర్శించారు. 

దేశంలో ఎక్కడ ఏ ఘటన జరిగినా.. దానిని ప్రధాని మోదీకి ఆపాదించడం మానుకోవాలని హితవు పలికారు. మణిపూర్ అల్లర్లు దురదృష్టకరమని అయితే, ఆ రాష్ట్రంలో శాంతియుత వాతావరణం నెలకొనేలా కేంద్రం చర్యలు తీసుకుంటుందని తెలిపారు.