
హైదరాబాద్లో మరో ప్రీ లాంచ్ స్కాం వెలుగుచూసింది. భారతి బిల్డర్స్ పేరుతో చలామణి అయిన ప్రీ లాంచ్ ప్రాజెక్ట్కు కోట్ల రూపాయలు చెల్లింపులు చేశామని 250 బాధితులు రోడ్డెక్కారు. 5 సంవత్సరాల కిందట భారతి బిల్డర్స్ ఈ ప్రాజెక్ట్ మొదలు పెట్టింది. భారతి బిల్డర్స్ కనీసం 25 శాతం పనులు కూడా చేయలేదు. సాకులు చెబుతూ భారతి బిల్డర్స్ బాధితులను మోసం చేస్తూ వచ్చింది.
అనూహ్యంగా సునీల్ అహుజా అనే వ్యక్తికి ల్యాండ్ అమ్మేసి ప్రీ లాంచ్ ప్రాజెక్టుకు డబ్బులు కట్టిన పబ్లిక్ను భారతి బిల్డర్స్ నిండా ముంచేసింది. ఇదేంటని.. భారతి బిల్డర్స్ను బాధితులు ప్రశ్నించగా.. భారతి బిల్డర్స్, సునీల్ అహుజా అనే వ్యక్తి బెదిరింపులకు గురి చేస్తున్నారని బాధితులు వాపోయారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. భారతి బిల్డర్స్తో పాటు సునీల్ అహుజాపై సైబరాబాద్లో ఆర్థిక నేర విభాగం(EOW) పోలీసులు కేసు నమోదు చేశారు.
భారతి బిల్డర్స్ చేసిన నిర్వాకం ఏంటంటే..
హైదరాబాద్ కొంపల్లిలో ప్రీ లాంచ్ ఆఫర్ పేరుతో ఫ్లాట్లు ఇప్పిస్తానని రూ. కోట్లలో వసూలు చేసిన బిల్డర్ నిర్వాకం ఇది. బాధితులు తెలిపిన ప్రకారం.. కొంపల్లిలో ప్రీ లాంచ్ ఆఫర్ల పేరుతో అపార్టుమెంట్లు కట్టిస్తామని బిల్డర్ శివరామకృష్ణ పలువురి నుంచి రూ. కోట్లు వసూలు చేశాడు. ఒక్కో బాధితుడు రెండు, మూడు ప్లాట్లను బుక్ చేసుకుని రూ. 10 లక్షల నుంచి కోటిన్నర వరకు చెల్లించారు. అయితే దానికి ఫైనాన్షియర్ ఎమ్మెల్యే కాలనీకి చెందిన సునీల్ కుమార్ అహుజా ఉన్నారు.
►ALSO READ | ఐటీ ఉద్యోగులకు బుధవారం వర్క్ ఫ్రం హోం : బెంగళూరులో ఎందుకీ ప్రయోగం..!
కాగా ఫైనాన్షియర్ అహుజా, బిల్డర్ శివరామకృష్ణ మధ్య విభేదాలు తలెత్తాయి. దీంతో ఆ ప్రాజెక్టు మొత్తాన్ని సునీల్ కుమార్ స్వాధీనం చేసుకున్నారు. తాజాగా.. భారతి బిల్డర్స్ ఈ ల్యాండ్ను అమ్మేసింది. రెండేళ్ల లోపు ఫ్లాట్లు కట్టి అప్పగిస్తామన్న శివరామకృష్ణ ఐదేండ్లు అయినా పూర్తి చేయలేదు.
కస్టమర్లకు ప్లాట్లు ఇవ్వకపోవడంతో వారంతా శివరామకృష్ణను నిలదీశారు. దీంతో తన వద్దకు వచ్చిన కొందరికి చెక్కులు ఇచ్చి పంపించాడు. కాగా ఆ చెక్కులన్నీ బౌన్స్ అయ్యాయి. దీంతో కస్టమర్లు బిల్డర్ శివరామకృష్ణను నిలదీశారు. ఆయన ఫైనాన్షియర్ ప్రాజెక్టును స్వాధీనం చేసుకున్నారని చెప్పడంతో బాధితులంతా ఎమ్మెల్యే కాలనీలోని ఫైనాన్షియర్ ఇంటి వద్ద 2024 నవంబర్లోనే ఆందోళన చేశారు.