Bharta Mahashayualaku Wignapthi: భర్త మహాశయులకు సమాధానం ఇచ్చేలా: దర్శకుడు కిషోర్ తిరుమల

Bharta Mahashayualaku Wignapthi: భర్త మహాశయులకు సమాధానం ఇచ్చేలా: దర్శకుడు కిషోర్ తిరుమల

రవితేజ హీరోగా కిషోర్ తిరుమల దర్శకత్వంలో సుధాకర్ చెరుకూరి నిర్మించిన చిత్రం ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’. డింపుల్ హయతి, ఆషిక రంగనాథ్​ హీరోయిన్స్‌‌గా నటించిన ఈ సినిమా ఇవాళ జనవరి 13న ప్రేక్షకుల ముందుకొచ్చింది.

ఈ సందర్భంగా దర్శకుడు కిషోర్ తిరుమల మాట్లాడుతూ ‘ఒక భర్త తన అనుభవాలను  మిగతా భర్తలకి ఏ రకంగా చెబుతున్నాడు.. తను ఎలాంటి స్ట్రగుల్స్ ఎదుర్కొన్నాడు అనేది ఈ కథ. ఇందులో ఇద్దరు అమ్మాయిలు అడిగే ప్రశ్న చాలా సెన్సిబుల్‌‌గా ఉంటుంది. 

నిజానికి అలాంటి సమస్య వచ్చినప్పుడు గొడవలు పెట్టుకుంటారు. మనస్పర్ధలు పెంచుకుంటారు. విడాకులు కూడా తీసుకుంటారు. ఆ ప్రశ్నకు  సమాధానం ఈ సినిమాలో దొరుకుతుంది. ఈ కథని ఇల్లాలు ప్రియురాలు కోణంలో కాకుండా  డిఫరెంట్‌‌గా ట్రీట్ చేశాం. రామ్ సత్యనారాయణ క్యారెక్టర్ నేనేదైతే రాశానో  రవితేజ దాన్ని ఫాలో అయ్యారు.   

స్క్రీన్ మీద  ఫ్రెష్‌‌గా కనిపిస్తారు. హీరోయిన్స్ డింపుల్, ఆషిక ఇప్పటివరకు కనిపించని  డిఫరెంట్ రోల్స్‌‌లో కనిపించబోతున్నారు. సత్య, వెన్నెల కిషోర్ ట్రాక్స్ హిలేరియస్‌‌గా ఉంటాయి. అలాగే సునీల్‌‌తో  పెళ్ళాం ఊరెళితే, దుబాయ్ శీను లాంటి ఫన్ ఉంటుంది. ప్రొడ్యూసర్ సుధాకర్ చెరుకూరి సపోర్ట్‌‌తో బెస్ట్ అవుట్‌‌పుట్ వచ్చింది’ అని చెప్పాడు.