ఎయిర్‌ టెల్ మినిమమ్ మంత్లీ రీఛార్జ్‌‌ పెంపు

ఎయిర్‌ టెల్ మినిమమ్ మంత్లీ రీఛార్జ్‌‌ పెంపు

న్యూఢిల్లీ : ఎయిర్‌‌‌‌టెల్ తన ప్రీపెయిడ్ యూజర్లకు మినిమమ్ మంత్లీ రీఛార్జ్‌‌ను రూ. 35 నుం చి రూ.45కు పెంచింది. ఆదివారం నుంచి ఇది అమల్లో కి వచ్చింది.అంటే ఎయిర్‌‌‌‌టెల్‌‌ నెట్‌‌వర్క్ హోల్డర్స్‌‌ ఆ నెట్‌‌వర్క్‌‌ను కొనసాగించాలనుకుంటే కచ్చితంగా ప్రతి నెలా రూ.45 వెచ్చించాల్సిందే.
‘మినిమమ్ మంత్లీ రీఛార్జ్‌‌ కింద రూ.45 లేదా ఆపై మొత్తా లతో రీఛార్జ్ చేసుకోవడం తప్పని సరి. రీఛార్జ్ చేసుకున్న తర్వాత 28 రోజుల పాటు ఎయిర్‌‌‌‌టెల్ అన్ని సర్వీసులు లభిస్తాయి’ అని ఎయిర్‌‌‌‌టెల్ పేర్కొంది. ఒకవేళ రూ.45తో లేదా ఆపై మొత్తాలతో రీఛార్జ్ చేసుకోకపోతే, ఎయిర్‌‌‌‌టెల్ తన కస్టమర్లు 15 రోజుల పాటు గ్రేస్‌ టైమ్ ఇస్తుంది.