గవర్నర్ ను కలిసి వస్తుంటే సీఎం కార్యాలయం నుంచి ఫోన్

గవర్నర్ ను కలిసి వస్తుంటే సీఎం కార్యాలయం నుంచి ఫోన్

టిఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక దళితుల మీద దాడులు, లాకప్ డెత్ లు పెరిగాయన్నారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. గాంధీభవన్ దళిత ఆవేదన సభలో ఆయన పాల్గొన్నారు.  పోలీస్ ల దెబ్బలకు తట్టుకోలేక  మరియమ్మ చనిపోయిందని... దీనిపై తాము గవర్నర్ ను కలిసి వస్తుంటే సీఎం కార్యాలయం నుంచి ఫోన్ వచ్చిందన్నారు. దళిత ఎంపవర్ మెంట్ సమావేశానికి రావాలని ఆహ్వానించారని తెలిపారు. దళితుల మీద దాడులు చేస్తూ సమావేశానికి రమ్మంటే ఎందుకు రావాలని ప్రశ్నించానన్నారు భట్టి.  దాంతో సీఎం తమని కలవడానికి అవకాశం ఇచ్చారని.. దళితుల మీద దాడులు జరగకుండా కఠిన నిర్ణయాలు తీసుకోవాలని సీఎంను కోరామన్నారు. మహిళా పోలీసులు లేకుండా మరియమ్మ అరెస్ట్, ఆమె మృతి.. లాకప్ డెత్ దురదృష్టకరమన్నారు మహారాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి.. ఏఐసీసీ ఎస్సీ విభాగం చైర్మన్ నితిన్ రావత్. లాకప్ డెత్ చేసిన వాళ్లను సస్పెండ్ చేస్తే మరియమ్మ బతికి వస్తుందా అన్నారు. జస్టిస్ ఫర్ ఆల్ కోసం అందరం పోరాటం చేద్దామన్నారు నితిన్ రావత్.