రైతుల పేరుతో రాజకీయం వద్దు: భట్టి విక్రమార్క

రైతుల పేరుతో రాజకీయం వద్దు: భట్టి విక్రమార్క
  • సన్నవడ్లకు రూ. 500 బోనస్ ప్రారంభిచామని చెప్పాం
  • కోడ్ అమల్లో ఉన్నందున ఇంతకంటే క్లారిటీ ఇవ్వలేను
  •  బీఆర్ఎస్, బీజేపీ నాయకులవి తప్పుడు ఆరోపణలు
  •  కర్షకులు ఆందోళన చెందొద్దు.. ఇది ప్రజా ప్రభుత్వం
  • తడిచిని, మొలకెత్తిన ధాన్యాన్ని ఎంఎస్పీకే కొంటున్నం
  • మూడు రోజుల్లోనే రైతులకు డబ్బులు చెల్లిస్తున్నం
  • గత సర్కారు కన్నా 214 కేంద్రాలు ఎక్కువ ఏర్పాటు చేశాం
  •  రాష్ట్రంలో చివరి గింజ వరకూ కొనుగోలు చేస్తాం
  • గాంధీ భవన్ లో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క


హైదరాబాద్: బీఆర్ఎస్ , బీజేపీ లీడర్లు తమ స్వార్థం కోసం రైతుల పేరిట రాజకీయాలు చేయొద్దని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సూచించారు. తాము సన్నవడ్లకు రూ. 500 బోనస్ ప్రారంభించామని చెప్పామని క్లారిటీ ఇచ్చారు. ఇవాళ గాంధీభవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు.  ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున ఇంత కన్న స్పష్టత ఇవ్వలేకపోతున్నానని అన్నారు. రైతులకు నష్టం జరగకుండా చూడాలనేదే ప్రభుత్వ ఉద్దేశమని అన్నారు. గతేడాది అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం 7031 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసిందని, ఏప్రిల్ 9న ప్రొక్యూర్ మెంట్ సెంటర్లను ప్రారంభించిందని అన్నారు. 

తమ ప్రభుత్వం మార్చి 25నే కొనుగోళ్లు మొదలు పెట్టిందని అన్నారు. 7,247 కేంద్రాల ద్వారా ధాన్యం సేకరిస్తున్నదని చెప్పారు. బీఆర్ఎస్ ప్రభుత్వం తడిచిన ధాన్యాన్ని కొనుగోలు చేయలేదని, తాము తడిచిన, మొలకెత్తిన వడ్లను కూడా కనీస మద్దతు  ధరకే కొనుగోలు చేస్తున్నామని అన్నారు. కానీ బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు మాత్రం రైతుల పేరుతో రాజకీయాలు చేయాలని చూస్తున్నారని అన్నారు.  రైతులు అయోమయానికి గురి కావద్దని, చివరి గింజ వరకూ కొనుగోలు చేసత్ఆమని అన్నారు. కొన్న ధాన్యానికి మూడు రోజుల్లోనే డబ్బులు చెల్లిస్తామని చెప్పారు.