195 మంది కోసం కట్టింది.. 119 మందికి సరిపోదా: భట్టి

195 మంది కోసం కట్టింది.. 119 మందికి సరిపోదా: భట్టి

సెక్రటేరియట్: సెక్రటేరియట్ భవనాలు కూల్చవద్దని, కొత్త సెక్రటేరియట్ నిర్మాణం వద్దని కాంగ్రెస్ నేతలు ఎంపీ రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే భట్టి విక్రమార్క,  జగ్గారెడ్డి, శ్రీధర్ బాబు, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఎమ్మెల్యే సీతక్క, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్,మాజీ ఎమ్మెల్యే  కొండెటిశ్రీదర్ . ఈ రోజు సీఎల్పీ కార్యాలయం నుండి ర్యాలీ గా సెక్రటేరియట్ కి చేరుకున్నారు. ఆ సమయంలో తెలంగాణ, ఏపీ సెక్రటేరియట్ వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అసెంబ్లీలోకి వెళుతున్న సీఎల్పీ నేత భట్టి విక్రమార్కను పోలీసులు అడ్డగించారు. ఆ సమయంలో కాంగ్రెస్ నాయకులకు, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది.

ఆ తర్వాత శాససభ నిర్మాణ కోసం ఫౌండేషన్ కోసం మర్రి చెన్నారెడ్డి వేసిన ఫౌండేషన్ స్టోన్ ను పరిశీలించారు.  ఈ నెల 27 న కొత్త సెక్రటేరియట్ కు సీఎం కేసీఆర్ భూమి పూజ చేసిన ప్రాంతాన్ని కూడా కాంగ్రెస్ నేతలు పరిశీలించారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. ప్రస్తుతమున్న సెక్రటేరియట్, అసెంబ్లీ భవనాలను  కూల్చడం తుగ్లక్ చర్యగా తెలిపారు. ఇప్పుడున్న అసెంబ్లీని 50 ఏండ్లు నడపవచ్చని, వీటిని కూల్చడాన్ని ప్రతిపక్ష నేతలుగా తాము ఖండిస్తున్నామన్నారు. 1980 లో అసెంబ్లీ కి పునాది వేసి 1985 లో పూర్తి చేశారని, 195 మంది ఎమ్మెల్యే లకు ఉపయోగపడేలా అప్పటి అసెంబ్లీ కట్టారన్నారు. ఇప్పుడు ఉన్న119 మందికి ఈ అసెంబ్లీ సరిపోదా? అని ప్రశ్నించారు.  మారిన ప్రతి ముఖ్యమంత్రి కొత్త అసెంబ్లీ ,సెక్రటేరియట్ కడుతాం అంటే ఎట్లా.ప్రజా ధనం దుర్వినియోగం కాదా అని అన్నారు.

ప్రభుత్వం ప్రజల సొమ్మును కొత్త భవనాల పేరు మీద  దుర్వినియోగం చేస్తుందన్నారు భట్టి. ఈ ధనాన్ని ప్రజా ఉపయోగాల కోసమే వినియోగించాలన్నారు. అలా కాకుండా ప్రభుత్వం ప్రాముఖ్యత లేని వాటి మీద ఎక్కువ దృష్టి పెడుతుందని విమర్శించారు. అసెంబ్లీ, సెక్రటేరియట్ ప్రజలకు సంబంధించిన విషయమనీ, కచ్చితంగా ప్రతిపక్షాల ఒపీనియన్ తీసుకోవాలని ఆయన అన్నారు.