
- రియల్ ఎస్టేట్ అంటే నిర్మాణాలు కాదు నమ్మకం
- ఫ్యూచర్ సిటీతో హైదరాబాద్ రూప రేఖలు మారుతయ్
- సిటీలో త్వరలో పెట్రోల్,డీజిల్ కార్లు తిరగవు
- గ్రీన్ ఎనర్జీపైనే ప్రభుత్వం దృష్టి సారించింది
- మూసీ పునరుద్ధరణ, ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణం
- ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క
హైదరాబాద్: రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ పడి పోయిందని కొందరు కావాలని దుష్ప్రచారం చేస్తున్నారని, అదే నిజమైతే హైదరాబాద్ ఎకరా 170 కోట్లు ఎలా పలికిందని ఉపము ఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. ఇవాళ హైదరాబాద్ లో ప్రాపర్టీ షోను ప్రారంభిం చిన ఆయన మాట్లాడుతూ.. రియల్ ఎస్టేట్ అంటే నిర్మాణాలు కాదని, ఒక నమ్మకమని చెప్పారు. సిటీని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు.
మూసీ పునరుద్ధరించడంతో పాటు ఎలివేటెడ్ కారిడార్లు నిర్మిస్తామని చెప్పారు. ఫ్యూచర్ సిటీతో హైదరాబాద్ రూపు రేఖలు మారిపోతాయని అన్నారు. గ్రీన్ ఎనర్జీకి పెద్దపీట వేస్తున్నామని, సిటీలో త్వరలో పెట్రోల్ డీజిల్ కార్లు తిరగబోవని చెప్పారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు బిల్డర్లు,రియల్టర్లు ముందుకు రావాలని అన్నారు. టూరిజం అభివృద్ధికి అనేక ప్రణాళి కలుసిద్ధం చేశామని చెప్పారు. పట్టణీకరణకు ప్రాధాన్యం ఇస్తున్నామని అన్నారు.