69 రోజుల్లో 23 వేల147 ఉద్యోగాలిచ్చినం: భట్టి విక్రమార్క

69 రోజుల్లో 23 వేల147 ఉద్యోగాలిచ్చినం: భట్టి విక్రమార్క

వాస్తవాలకు అనుగుణంగా బడ్జెట్ ప్రవేశ పెట్టామన్నారు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క.   అసెంబ్లీలో బడ్జెట్ పై  చర్చ సందర్బంగా మాట్లాడిన ఆయన .. అసమానతలను తొలగించడానికి  బడ్జెట్ లో ప్రయార్టీని ఇచ్చామన్నారు. కేటాయింపుల్లో్ సమన్యాయంతో సామాజిక న్యాయం చేశామని చెప్పారు.  గతంలో బడ్జెట్ ను ప్రతిసారి 20 శాతం  పెంచుకుంటూ పోయారని తెలిపారు.   ప్రతీ బడ్జెట్ లో కేటాయింపులు పెంచారే తప్ప ఖర్చు చేయలేదని విమర్శించారు.

గత తొమ్మిది బడ్జెట్ లో దాదాపు 14 లక్షల కోట్లకు పైగా బడ్జెట్ పెడితే.. 12లక్షల కోట్లకు పైగా మాత్రమే ఖర్చు చేశారన్నారు. గతంలో బడ్జెట్   ప్రతిపాదనలు ఎక్కువ.. ఖర్చు చేసింది తక్కువ అన్నారు. గతంలో సర్కార్ దళితబంధు, మూడెకరాల భూమికి డబ్బులు ఇవ్వలేని పరిస్థితి నెలకొందని చెప్పారు. తెచ్చిన అప్పులు  తీర్చలేక మళ్లీ అప్పు చేయాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు.

గత  పదేళ్లుగా గ్రూప్ 1 పరీక్ష నిర్వహించలేకపోయారని ధ్వజమెత్తారు భట్టి. అధికారంలోకి వచ్చాక  వెంటనే ఉద్యోగాల భర్తీకి ప్రక్రియచేపట్టామన్నారు.  వైద్యరంగం,సింగరేణిలో ఉద్యోగాల నియామక పత్రాలు అందజేశామన్నారు. 69 రోజుల్లో 23,147 మందికి పోస్టులిచ్చామని తెలిపారు. ఆరు గ్యారంటీలకు  లెక్క ప్రకారమే డబ్బులు ఇస్తున్నామన్నారు. ఉన్నదాంట్లోనే అన్ని సర్దుకునేలా ప్లాన్ చేశామని చెప్పారు.  కేంద్రం నుంచి నిధులు తెచ్చేందుకు కృషి చేస్తామని తెలిపారు.