
సంగారెడ్డి సభలో బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కౌంటర్ ఇచ్చారు. సర్వేలో బీఆర్ఎస్‌కు ఒకట్రెండు సీట్లు వస్తాయని తేలింది.. కేసీఆర్‌కు వచ్చే సీట్లే మాకు వస్తాయని చెబుతున్నారని అన్నారు. బీఆర్ఎస్‌ను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు భట్టి. 10 ఏళ్ల నుంచి బీఆర్ఎస్ చెప్పే మాయమాటలు ప్రజలకు తెలుసునని... ప్రతి హామీని వంద శాతం మేం అమలు చేస్తామని చెప్పుకొచ్చారు. -
తెలంగాణలో ఇల్లు లేని పేదవాడు ఉండకూడదన్నారు భట్టి విక్రమార్క .. అర్హులైనవారందరికీ ఇల్లు ఇస్తామని హామీ ఇచ్చారు. సంపద సృష్టించి పేదలకు పంచుతామని తెలిపారు. పార్టీలో అన్ని వర్గాలకు సముచిత స్థానం కల్పిస్తామని .. వచ్చే ఐదేళ్లలో అందరికి న్యాయం చేస్తామని వెల్లడించారు. అన్ని వర్గాలకు ఆదరించే ఏకైక పార్టీ కాంగ్రెస్ మాత్రమేనని చెప్పుకొచ్చారు.
also read : రైతులకు ఇది లాభదాయకం... పాత సైకిల్ తో కలుపుమొక్కలు తీయొచ్చు..
విద్యుత్, ఆర్థికశాఖలను బీఆర్ఎస్ ప్రభుత్వం అస్తవ్యస్థం చేసిందని ఆరోపించారు భట్టి విక్రమార్క. ఈ రెండు శాఖలు తమ ప్రభుత్వానికి ఒక సవాల్ అని తెలిపారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కోతలు లేకుండా నిరంతర విద్యుత్ ఇస్తున్నామన్నారు. కరెంట్ కోతలు అనేవి అవాస్తవమని తెలిపారు. ఇక కేంద్రంలో ఇండియా కూటమి రాబోతుందని ధీమా వ్యక్తం చేశారు భట్టి విక్రమార్క. అత్యధిక సీట్లలో గెలిచి కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని చెప్పారు.